Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ సోదరిని చూశారా ?.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

నార్త్ అమ్మాయి అయినా తన అభినయంతో ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరోసారి హిట్ అందుకుంది న్యాచురల్ స్టార్ నానికి జోడిగా ఈ మూవీలో యష్ణ పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు, తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది మృణాల్.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ సోదరిని చూశారా ?.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Mrunal Thakur

Updated on: Feb 28, 2024 | 9:36 AM

‘కురుక్షేత్రంలో రావణ సంహారం! యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులు దొచేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే సౌత్ అడియన్స్‏కు తెగ నచ్చేసింది. నార్త్ అమ్మాయి అయినా తన అభినయంతో ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరోసారి హిట్ అందుకుంది న్యాచురల్ స్టార్ నానికి జోడిగా ఈ మూవీలో యష్ణ పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు, తమిళంలో మరిన్ని చిత్రాల్లో నటిస్తుంది మృణాల్.

మృణాల్ నార్త్ అమ్మాయి. మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో జన్మించిన ఈ భామ.. నటనపై ఆసక్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ముందుగా 2012లో ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. 2018 లవ్ సోనియా అనే హిందీ సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సూపర్ 30, బట్ల హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, జెర్సీ చిత్రాల్లో నటించి అలరించింది.

2022లో సీతారామం సినిమా ద్వారా తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది మృణాల్. తాజాగా ఆమె సోదరికి సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మృణాల్ సోదరి పేరు లోచన్ ఠాకూర్. ఆమె మోడల్ కమ్ నటి కూడా. ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా తన చెల్లెలు మృణాల్ కు సంబంధించిన ఫోటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.