
సాధారణంగా సినీపరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను అనుకోకుండా మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకుంటారు. మరికొన్ని సార్లు ఓ స్టార్ హీరో ఖాతాలో పడాల్సిన డిజాస్టర్.. వేరే నటుడి చెంతకు చేరుతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలా తెలుగు సినీ పరిశ్రమలో ఓ స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరోకు అతి పెద్ద విజయాన్ని అందించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు ?.ఏ సినిమా ?అనేది తెలుసుకుందామా. అతనే హీరో అర్జున్ సర్జా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఫ్యామిలీ అడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో అర్జున్ ఒకరు. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అందులో ఒకే ఒక్కడు మూవీ తన కెరీర్ లో మైలురాయిగా నిలిచింది.
తెలుగుతోపాటు.. తమిళంలోనూ రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు ముందుగా అనుకున్నది హీరో అర్జున్ కాదట. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ఈసినిమా చేయాలనుకున్నారట డైరెక్టర్ శంకర్. అయితే ఇదే విషయాన్ని చిరుతో శంకర్ చెప్పగా.. ప్రాజెక్ట్ చేసేందుకు చిరు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
కానీ ఆ తర్వాత ఈ సినిమా ప్రారంభించే సమయంలో చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండడం.. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. దీంతో చిరు స్థానంలో అర్జున్ సర్జాను తీసుకున్నారు. 1999లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో మనీషా కొయిరాలా కథానాయికగా నటించగా.. రఘువరన్ ప్రతినాయకుడిగా కనిపించారు. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటుంది.