Karthika Deepam: కార్తీకదీపం డాక్టర్ బాబు తండ్రి తోపు నటుడు.. డైరెక్టర్ కమ్ రైటర్.. ఎవరో తెలుసా.. ?

బుల్లితెరపై ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు నిరుపమ్ పరిటాల. చంద్రముఖి, కార్తీక దీపం 1, 2 సీరియల్స్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు. కానీ మీకు తెలుసా.. నిరుపమ్ పరిటాల తండ్రి తెలుగు సినీరంగంలో తోపు నటుడు.

Karthika Deepam: కార్తీకదీపం డాక్టర్ బాబు తండ్రి తోపు నటుడు.. డైరెక్టర్ కమ్ రైటర్.. ఎవరో తెలుసా.. ?
Nirupam Paritala

Updated on: May 25, 2025 | 12:20 PM

నిరుపమ్ పరిటాల.. ఈ పేరు చెబితే గుర్తుపట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు. దశాబ్దాలుగా టీవీరంగంలో బ్యాక్ టూ బ్యా్క్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు, కార్తీక్ బాబు పాత్రలతో మరింత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నిరుపమ్. కానీ మీకు తెలుసా.. కార్తీక్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల తండ్రి తెలుగు సినీరంగంలో తోపు నటుడు. ఎన్నో సినిమాల్లో కీలకపాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా సినిమాలు, సీరియల్స్ చేశాడు.

నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్ పరిటాల. తెలుగు సినీరంగంలో చాలా సంవత్సరాలు నటుడిగా కొనసాగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా ముప్పైకి పైగా సినిమాలు.. యాభై వరకు సీరియల్స్ చేశారు. జగపతి బాబు హీరోగా నటించిన పందిరి మంచం సినిమాతో ఓంకార్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత పోలీస్ భార్య, అన్న తమ్ముడు వంటి 20కి పైగా సినిమాలకు కథ, డైలాగ్స్ అందించారు. పోలీస్ భార్యతోపాటు మరికొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు.

తెలుగులో నిన్నే పెళ్లాడతా, పవిత్రబంధం, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, అలౌకిక, ఇది కథ కాదు వంటి సీరియల్స్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషించారు. 47 ఏళ్ల వయసులో గుండె పోటుతో కన్నుమూశారు. ఓంకార్ పరిటాల వారసుడిగా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టిన నిరుపమ్.. చంద్రముఖి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన నిరుపమ్ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..