పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా? ఈమె భర్త టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌.. ఎవరో తెల్సా

|

Oct 16, 2024 | 12:30 PM

తకిట తకిట సినిమా గుర్తుందా.? ఈ మూవీ ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసింది కన్నడ కస్తూరి హరిప్రియ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచినా.. దీని తర్వాత మరిన్ని అవకాశాలు హరిప్రియ తలుపుతట్టాయి.

పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా? ఈమె భర్త టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌.. ఎవరో తెల్సా
Tollywood 1
Follow us on

న్యాచురల్ స్టార్ నాని సినిమాల్లో ‘పిల్ల జమీందార్’ మూవీ గుర్తుండిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నానికి జోడిగా బింధు మాధవి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. బిందు మాధవి మోడరన్ గర్ల్‌గా, నాని గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మెప్పిస్తే.. అచ్చమైన తెలుగమ్మాయి సింధు పాత్రలో అందం, అభినయంతో మెప్పించింది కన్నడ కస్తూరి హరిప్రియ. ‘తకిట తకిట’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన హరిప్రియ.. రెండో సినిమా ‘పిల్ల జమీందార్’తో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ‘అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది హరిప్రియ. అయితే ఈ సినిమాల తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు హరిప్రియ కానీ కన్నడ సినిమాల్లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. బెల్ బోటమ్, కురక్షేత్ర, పెట్రోమాక్స్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది.

ఆ ఇండస్ట్రీలో పేరొందిన స్టార్ హీరోలు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళీ, ధృవ్ సర్జాలతో కలిసి నటించింది. గతేడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన హరిప్రియ. ప్రముఖ విలన్, కేజీఎఫ్ నటుడు వశిష్టను పెళ్లి చేసుకుంది. వశిష్ట తెలుగులో పలు చిత్రాల్లో విలన్‌గా నటించాడు. కర్ణాటకకు చెందిన ఈ యాక్టర్ మొదట ఎక్కువగా కన్నడ చిత్రాల్లోనే నటించాడు. ఇక 2021లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘నారప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్, డెవిల్, ఏవమ్ లాంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించాడు. అలాగే కేజీఎఫ్, సింబా లాంటి చిత్రాల్లో కీలక పాత్రలలో కనిపించాడు. అలాగే వశిష్ట అటు కన్నడంలోనూ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా నటించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి