
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు తారక్. ఇక ఎన్టీఆర్ హీరోగా పరిచయం కాక ముందే బాలనటుడిగా అలరించారు. తారక్ బాలనటుడిగా నటించిన సినిమా బాలరామాయణం. బాల రామాయణం 1996 లో అందరూ పిల్లలతో నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మల్లెమాల సుందర రామిరెడ్డి గారు నిర్మించారు. ఇందులో జూనియర్ ఎన్.టి.ఆర్ రామునిగా నటించాడు. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ బాలల సినిమాగా ఎంపికచేయబడినది.ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన చిన్నారి ఎవరో తెలుసా..?
ఆమె పేరు స్మిత మాధవ్. ఈ సినిమా వచ్చి పాతికేళ్ల అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నారి సీత ఎలా ఉందో తెలుసా..? స్మితా మాధవ్ కర్నాటిక్ క్లాసికల్ సింగర్ అలాగే భరతనాట్యం డాన్సర్. శృతి లయ కేంద్ర నటరాజాలయ డైరెక్టర్ గురు నృత్య చూడామణి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ ద్వారా స్మిత భరతనాట్యంలో శిక్షణ పొందింది. స్మిత హైదరాబాద్ సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది.
స్మిత తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతం, నృత్యంలో డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఇందిరకళ సంగీత విశ్వ విద్యాలయం నుంచి నృత్యంలో మాస్టర్స్ అలాగే మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో మాస్టర్స్ అందుకుంది. ఇక బలరామాయణం సినిమా తర్వాత ఆమధ్య ఆర్ట్ ఫిల్మ్ పృథ్వీలో స్మిత కథానాయికగా నటించింది. బుల్లితెరపై, స్మిత పలు భాషల్లో అనేక షోలకు యాంకరింగ్ చేసింది. ఇక ఇప్పుడు ఆమె పలు స్టేజ్ షోలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉందని స్మిత.. అడపాదడపా తన డాన్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.