AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పటికీ అదే అందం

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో హీరోలు స్వయం కృషితో వచ్చి.. తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రేక్షకులను మెప్పించి స్టార్స్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన చాలా మంది హీరోలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పటికీ అదే అందం
Uday Kiran
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2025 | 12:04 PM

Share

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే  నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది. గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ అదితీ శర్మ నటించింది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. అయినా ఎంతో చక్కగా నటించిందీ అందాల తార. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. అదితీ అందం, అభినయానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. గుండె ఝల్లుమంది తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్‌ మూవీలో కనిపించింది అదితి. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్ వంటి నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఈ సినిమాకు కూడా ప్రశంసలు వచ్చాయి తప్పితే కమర్షియల్‌ గా విజయం సాధించ లేదు. దీని తర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు కరువయ్యాయి.

ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో నూ నటించింది. మొత్తం మీద తెలుగు, హిందీ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ. కాగా 2014లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అదితీ శర్మ. ఈ దంపతులకు 2019లో సర్తాజ్ అనే కుమారుడు జన్మించాడు. కాగా పెళ్లి తర్వాత కేవలం పంజాబీ సినిమాలకే పరిమితమంది అదితి. అలాగే టీవీ షోస్ లోనూ మెరుస్తోంది. వీటితో పాటు తన భర్త బిజినెస్‌ పనులను కూడా చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత