ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.? బయట ఎంత అందంగా ఉందో చూడండి

దర్శక ధీరుడు రాజమౌళి అపజయం అంటూ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం హిట్, సూపర్ హిట్స్ మాత్రమే కాదు ఏకంగా పాన్ ఇండియా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్‌లో ఈ గొండు జాతి మహిళ గుర్తుందా.? బయట ఎంత అందంగా ఉందో చూడండి
Rrr

Updated on: Dec 08, 2025 | 9:45 AM

దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వారణాసి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ 2022లో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుతో పాటు పలు గ్లోబల్ అవార్డులను సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై తెలిసేలా చేసిందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అదరగొట్టారు  ఇక ఈ సినిమాలో మల్లి అనే పాత్రలో మెరిసిన చిన్న పిల్ల మీకు గుర్తుందా.? సినిమాకి కీలకంగా మారిన ఆ పాత్రలో ఆ అమ్మాయి తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఆమె తల్లిగా నటించిన నటి ఎవరో మీకు తెలుసా.? గొండు జాతి మహిళగా కనిపించి మెప్పించింది ఆమె. సినిమాలో ఆమె కనిపించింది తక్కువ సేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది.

బ్రిటీష్ రాణి తన కూతురుని తీసుకెళ్తుంటే.. బిడ్డ కోసం పరితపిస్తూ.. ఆ కారు వెంట పరిగెడుతుంది. బిడ్డను తిరిగి తన ఒడికి చేరినప్పుడు సంబరపడిపోతుంది ఈ తల్లి. ఇక ఈ లోకి పాత్రలో కన్నీరు పెట్టించిన ఆ నటి మరెవరో కాదు అహ్మరీన్ అంజుమ్.

ఆమె ఓ హిందీ నటి. షార్ట్ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్, టెలివిజన్ షోస్, సినిమాలలో కూడా నటించింది. అలాగే ఆమె స్టేజ్ ఆర్టిస్టు కూడా. ఇంకా చెప్పాలంటే హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఉర్దూ, బెంగాళీ, తెలుగు లాంటి పలు భాషలను అనర్గళంగా మాట్లాడే బహుముఖ ప్రజ్ఞాశాలి. 2022లోని బ్రిటీష్- సౌత్ ఏషియన్ యాక్టర్ డానీ సురాను వివాహమాడింది ఈమె. ఈమె నటి మాత్రమే కాదు.. నటనలో గుర్తింపు సాధించాలనుకునేవారికి తన భర్తతో కలిసి యాక్టింగ్‌ క్లాసులు చెబుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి