ఇది కదా షాక్ అంటే..! ఈ హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి మావ..!

సినీరంగుల ప్రపంచంలోకి చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు.

ఇది కదా షాక్ అంటే..! ఈ హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి మావ..!
Uma Maheswara Ugra Roopasya

Updated on: Mar 19, 2025 | 12:59 PM

వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు నటుడు సత్య దేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ముకుంద సినిమాలో సత్యదేవ్ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే హీరోగా ఎన్నో ఆకట్టుకునే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సత్య దేవ్ హీరోగా నటించి మెప్పించిన సినిమాల్లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా ఒకటి. 2020 లో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. . ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన మహేశ్‌ ఇంటే ప్రతికారం చిత్రాన్ని తెలుగులోకి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యగా తీసుకువచ్చారు.

ఈ సినిమాలో సత్య దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.. కేరాఫ్‌ కంచరపాలెంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది. ఈ సినిమా కోవిడ్ సమయం కావడంతో థియేటర్స్‌లో రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారు నటించారు. ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ ఉమా మహేశ్వర రావుగా నటించాడు సత్యదేవ్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.?

ఆమె పేరు రూప కొడువాయూర్.. చక్కని రూపంతో పాటు నటనతోను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే. ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఆమద్యే మిస్టర్ ప్రెగ్నెంట్.. బిగ్ బాస్ సోహెల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.