అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సంపంగి హీరోయిన్
తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన అందమైన ప్రేమకథ చిత్రాల్లో సంపంగి ఒకటి. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చాలా మంది ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఇష్టంగా వింటుంటారు. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది

సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్‌లుగా ఎన్నో సినిమాల్లో నటించి, మంచి స్టార్‌డమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటారు. ఆ తర్వాత వయసు పెరుగుతుండటంతో అవకాశాలు తగ్గిపోతుంటాయి. అప్పుడు కొందరు సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం దూరంగా ఉంటారు. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులుగానో, టీవీ సీరియల్స్ ద్వారానో తిరిగి వస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. అలాంటి వారిలో సంపంగి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాంచీ కౌల్ ఒకరు. కాంచీ కౌల్ అనగానే సంపంగి సినిమాతో పాటు అందులోని పాటలు గుర్తుకు వస్తాయి. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కాకపోయినప్పటికీ, అప్పట్లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే
ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సంపంగి సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కాంచీ కౌల్, ఆ తర్వాత చెప్పాలని ఉంది, ఫ్యామిలీ సర్కస్, అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి పలు తెలుగు చిత్రాలలో నటించి అలరించారు. చూడటానికి అందంగా, గ్లామరస్‌గా కనిపించే ఈ హిందీ భామ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా బిజీగా ఉన్న రోజుల్లోనే, కాంచీ కౌల్ హిందీ సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, అలాగే హిందీ టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. టీవీ సీరియల్స్‌లో నటించే సమయంలోనే ఆమె తోటి నటుడు షబ్బీర్ అహూవాలియాతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. షబ్బీర్ అహూవాలియా హిందీ టీవీ రంగంలో ఒక ప్రముఖ నటుడు.
అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..
అతనికి మంచి స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. ఇతడు ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయనకు హిందీ సీరియల్స్‌లో మంచి డిమాండ్ ఉంది. కేవలం హిందీ టీవీ రంగంలోనే కాకుండా, షబ్బీర్ అహూవాలియా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. హిందీలో వచ్చిన కుంకుం భాగ్య అనే సీరియల్ జీ టీవీలో తెలుగులో కుంకుమ భాగ్యం అన్న పేరుతో ప్రసారమైంది. ఈ సీరియల్ ద్వారా షబ్బీర్ మన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కుంకుమ భాగ్యం సీరియల్‌లో లీడ్ నెగెటివ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. ఇతను సీరియల్స్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. ప్రస్తుతం కాంచీ కౌల్, షబ్బీర్ అహూవాలియా దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




