యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ కొట్టాలని చాలా కసిమీద ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకున్తున్నాడు. ఈ క్రమంలోనే సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే సినిమా చేశాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రచించి దర్శకత్వం వహించారు ఈ సినిమాకు. 2016 లో వచ్చిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా నటించింది అర్థనా బిను. చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ మలయాళ కుటీ.
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో వరస సినిమాలు చేసింది.
ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడి లేటేస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు చాలా అందంగా ఉంది ఈ భామ.