పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ ఫుల్ మూవీ కొమురం పులి. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. 2010లో వచ్చిన ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో పవన్ నటన, మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఆడలేదు. అలాగే ఈ సినిమా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కు జోడీగా నికీషా పటేల్ నటించింది. ఈ అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నికీషా పటేల్ పలు సినిమాల్లో చేసి ఆ తర్వాత టాలీవుడ్ కు గుడ్ బై చెప్పింది. అందం అభినయం ఉన్న ఈ భామ టాలీవుడ్‌లో ఎక్కువ కాలం రాణించలేక పోయింది.
పులి సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఓం 3డి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అరకు రోడ్డులో, గుంటూరోడు సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు నికీషా పటేల్.
ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉంది అని నెటిజన్లు అరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. అప్పటికి ఇప్పటికి ఈ అమ్మడి అందంలో చాలా మార్పు కనిపిస్తోంది.