నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

|

Aug 01, 2024 | 1:30 PM

2005 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నటుడు శ్రీహరి అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ అయ్యి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. తొమ్మిది భాషల్లోకి నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్ అయ్యింది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Nuvvostanante Nenoddantana
Follow us on

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదటిసారి దర్శకుడిగా మారి చేసిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. 2005 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నటుడు శ్రీహరి అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ అయ్యి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. తొమ్మిది భాషల్లోకి నువ్వొస్తానంటే నేనొద్దంటానా
రీమేక్ అయ్యింది. ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్ కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో వీరితో పాటు చాలా మంది నటించి ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాలో సిద్దార్థ్ ను ఇష్టపడే అమ్మాయిగా అతని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించే అమ్మాయిగా కనిపించిన నటి ఎవరో తెలుసా.? ఆమె పేరు నందిత జెన్నిఫర్. తెలుగులో ఒక ఒక్క సినిమా చేసింది. కానీ తమిళ్ లో చాలా సినిమాల్లో నటించింది. అలాగే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది  ఈ అమ్మడు. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోల్లోనూ నటించింది ఈ అమ్మడు. పవిత్ర, వేర్ ఇస్ విద్యాబాలన్, నా రూట్ సెపరేట్ అనే సినిమాల్లో సాంగ్స్ లో గెస్ట్ గా కనిపించింది.

ఇక పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు 2007లో కాశీవిశ్వనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక సోషల్ మీడియాలో నందిత జెన్నిఫర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో నటిస్తుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో గ్లామర్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట చీరకట్టులో అదరగొడుతోంది.

నందిత జెన్నిఫర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి