
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత రజినీకాంత్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు రజినీకాంత్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటికే దాదాపు 700 కోట్లవరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ మూవీకి అనిరుద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచింది. థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. జైలర్ సినిమా పైరసీ కి గురైన విషయం తెలిసిందే.. థియేటర్స్ లో రన్ అవుతుండగానే హెచ్ డీ ప్రింట్ తో పలు వెబ్ సైట్స్ లో ఈ సినిమా పైరసీకి గురైంది.
దాంతో ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 7న జైలర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఇక జైలర్ మూవీ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా 200కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. మాములుగా రజిని ఈ సినిమా కోసం రూ. 110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర నిర్మాత అదనంగా మరో రూ. 100 కోట్లు ఇచ్చారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఇక జైలర్ టీమ్ లో మిగిలిన వారు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..? నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే జైలర్ టీమ్ లో కొంతమందికి కాస్ట్లీ కార్లుగిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకోసం రూ. 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలాగే అనిరుద్ రూ. 30 కోట్లు, స్పెషల్ రోల్ లో కనిపించిన తమన్నా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారట. ఇక ఈ మూవీలో అతిథి పాత్రల్లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఎంత అందుకున్నారో తెలియాల్సి ఉంది.
After #Jailer : #Rajinikanth Salary – 200 Crs ( Highest Paid Actor) 😎#Nelson Salary- 60 crs ( Highest Paid director)🔴#Aniruth Salary – 30 Crs ( Highest Paid Music director) 🎵🎶#TamannaahBhatia Salary – 10 Crs ( Highest Paid Actress In Kollywood) 👩
One industry Hit… pic.twitter.com/SIphwTrmT3
— Spicy Chilli (@spicychilli4u) September 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..