
సూపర్ స్టార్ కృష్ణ కూతురు, మహేష్ బాబు అక్కగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల ఘట్టమనేని. నటిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా.. ఇలు పలు రంగాల్లో ఆమెకు ప్రావీణ్యముంది. ఇక మంజుల నటించి నిర్మించిన షో సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీంతో పాటు కావ్యాస్ డైర, ఆరెంజ్ ,సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్, మంత్ ఆఫ్ మధు తదితర సినిమాల్లో తళుక్కుమంది మంజుల. ఇదే క్రమంతో తన తల్లి పేరు మీదుగా ప్రారంభించిన ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పోకిరి, ఏ మాయ చేశావే వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. ఇక సందీప్ కిషన్ తో కలిసి మనసుకు నచ్చింది అనే ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీకి దర్శకత్వం కూడా వహించింది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకున్న మంజుల సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. లైఫ్ స్టైల్ టిప్స్ తో పాటు అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.
అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. మంజుల షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో చిన్నారిగా కనిపించిన జాహ్నవి ఇప్పుడు అచ్చం హీరోయిన్ లా మారిపోయింది. మోడ్రన్ డ్రస్ లో అందంగా కనిపిస్తున్న జాహ్నవి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు జాహ్నవి సినిమాల్లోకి వస్తే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది జాహ్నవి. ఇదే ఆమెకు మొదట సినిమా. ఆ తర్వాత మరే సినిమాలోనూ మంజుల కూతురు నటించలేదు. అయితే టీనేజ్ లో ఉన్న జాహ్నవి తన స్టడీస్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉందని తెలుస్తోంది. మరి భవిష్యత్‌లో జాహ్నవి సినిమాల్లోకి వస్తుందేమో చూడాలి. తాజాగా జాహ్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.