యాక్షన్ హీరో గోపీచంద్ హిట్ కొట్టడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ అందుకోలేకపోతున్నారు గోపీచంద్. గోపీచంద్ ఇప్పటికే చాలా రకాల జోనర్స్ టచ్ చేశారు. ఫ్యామిలీ, యాక్షన్, లవ్ ఇలా ఎన్ని జోనర్స్ చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గరవిజయం సాదించలేకపోతున్నాయి. రీసెంట్ గా భీమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రణం సినిమా ఒకటి.
రణం సినిమా గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు అమ్మ రాజేశేఖర దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా..? చేసింది కొన్ని సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ అమ్మడి పేరు కామ్నా జెఠ్మలానీ. టాలీవుడ్ లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది. రణం సినిమా తర్వాత బెండప్పారావు సినిమాలో నటించింది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది.
తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ బాషల్లోను సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ చిన్నది. కామ్నా కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలో కామ్నా లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.