
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది గతంలో ఏవేవో ఉద్యోగాలు, పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం, ఫ్యామిలీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వారే. ఈ దక్షిణాది ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, స్వయం కృషితో ఎదిగిన నటుల్లో ఇతను కూడా ఒకడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో 17 ఏళ్ల వయసులోనే ఇంటిని వదిలి పెట్టాడు. 17 ఏళ్ల వయసులోనే ఎన్నో కలలతో చెన్నైకి వచ్చాడు. అయితే ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా పని చేయాల్సి ఉండటంతో.. ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. చాలా ఏళ్ల పాటు పాట ఆటో నడిపుతూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. మొదట ఓ సీరియల్ లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లనూ ఛాన్స్ లు వచ్చాయి. కట్ చేస్తే.. ఇప్పుడతను దక్షిణాది సినిమాల్లో స్టార్ నటుడిగా మారిపోయాడు. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో సహాయక నటుడిగా, విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇంతకీ అతనెవరని అనుకుంటున్నారా? బోస్ వెంకట్. ఈ పేరు చెబితే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు.. కానీ.. కార్తీ నటించిన ఖాకీ సినిమా గుర్తుందా? అందులో కార్తీ వెన్నంటి ఉండే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ సత్య అంటే గుర్తు పడతారు.
2003లో విడుదలైన ‘ఈర నీలం’ సినిమాతో నటుడిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు బోస్ వెంకట్. ఆ తర్వాత ‘అరసచ్చి’, ‘కన్నమ్మ’, ‘తలైనగరం’, ‘శివాజీ’, ‘ధామ్ ధూమ్’, ‘సింగం’, ‘గో’, ‘గంగ్వా’, ‘విడుతులై 2’ వంటి తమిళ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. జైహింద్ 2, మలుపు, రానా దగ్గుబాటి అరణ్య తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడీ యాక్టర్. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించాడు బోస్ వెంకట్. తన నటనతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా ఈ మధ్యన సినిమాలతో పాటు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు బోస్ వెంకట్. ఆ మధ్యన టీవీకే పార్టీ అధినేత హీరో దళపతి విజయ్ పై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారడీ ట్యాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఈ నటుని చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.