Tollywood: డాడీ మూవీ చిన్నారి గుర్తుందా.? ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది.. చూస్తే స్టన్
డాడీ సినిమా గుర్తుందా.? ఇందులో అక్షయ పాత్రలో నటించిన ఓ చిన్నారి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. చక్కటి నటన, అమాయకపు కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మరి ఆమె ఎవరి.? ఇప్పుడు ఏం చేస్తోంది.? అనే వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం..
2001లో విడుదలైన డాడీ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో చిరు కూతురిగా నటించిన చిన్నారి.. అప్పట్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు అనుష్క మల్హోత్రా. ఈ మూవీలో అక్షయ పాత్రలో కనిపించిన అనుష్క మల్హోత్రా.. తన అమాయకపు చూపులతో, చక్కటి నటనతో అందరినీ కట్టిపడేసింది. ముంబైకి చెందిన అనుష్క మల్హోత్రాకు టాలీవుడ్‌లో తెలిసినవారి ద్వారా ‘డాడీ’ సినిమా ఛాన్స్ వచ్చింది.
డాడీ మూవీతో నటనకు గానూ మంచి మార్కులు దక్కించుకున్న అనుష్క మల్హోత్రా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా.. చదువుపై దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడి కోసం నెటిజన్లు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనుష్క మల్హోత్రా.. మతిపోగొట్టే ఫోజులతో కవ్విస్తుంది. ఈ చిన్నది ఇప్పటికే లండన్ లో హోనర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. అనుష్క నెట్టింట ఎప్పటికప్పుడు తన ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంది.