
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తుంది ధురంధర్. అంచనాలకు మించి ఈ మూవీకి రెస్పాన్స్ వస్తుంది. అటు పలు దేశాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినప్పటికీ… ఇటు భారతదేశంలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమోగుతున్న పేరు ధురంధర్. ఇందులో రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్యధర్ భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ అని మీకు తెలుసా.. ? ఆమె తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆదిత్యధర్ విషయానికి వస్తే.. 2019లో ఉరి అనే సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు.
ఆ తర్వాత హిందీలో ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ధురంధర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ధురంధర్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. ఆదిత్యధర్ భార్య తెలుగులో హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. యామీ గౌతమ్. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2021లో పెళ్లి చేసుకున్నారు. యామీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఆదిత్యధర్ తెరకెక్కించిన ఉరి చిత్రంలో నటించింది. ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఉరి తర్వాత పలు చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో నువ్విలా, కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం, యుద్ధం వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు తెలుగులో సరైన బ్రేక్ మాత్రం రాలేదు. హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే ఆదిత్యధర్ తో కలిసి ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు వేదవీర్ ధార్ అనే అబ్బాయి ఉన్నాడు. ప్రస్తుతం యామీ గౌతమ్ సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..