Pushpa 2: ఉగ్రగంగమ్మ రూపంలో అల్లు అర్జున్.. ఆ పోస్టర్ వెనక ఉన్న కథ ఇదే..

|

Apr 08, 2023 | 6:29 PM

పట్టుచీరకట్టులో.. మెడలో నిమ్మకాయల దండతో.. ఒంటి నిండా బంగారు ఆభరణాలతో.. చేతికి గాజులు.. ముక్కుపుడకతో .. కాలీ మాతకు ప్రతీకలా దర్శనమిచ్చాడు బన్నీ. ఆయన నిల్చున్న తీరు.. కళ్లల్లో రౌద్రం చూస్తే.. శత్రువుల ఊచకోత ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Pushpa 2: ఉగ్రగంగమ్మ రూపంలో అల్లు అర్జున్.. ఆ పోస్టర్ వెనక ఉన్న కథ ఇదే..
Allu Arjun Pushpa
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అల్లు అర్జున్ లేటేస్ట్ ఫోటో. ఆయన బర్త్ డే సందర్భంగా నిన్న విడుదల చేసిన ఉగ్రగంగమ్మ రూపంలో బన్నీ పిక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. విడుదలైన క్షణాల్లోనే ఈ ఫోటోకు విపరీతమైన రెస్పాన్స్ నచ్చింది. ముందుగా టీజర్ విడుదల చేసి అభిమానులను ఖుషి చేసిన పుష్ప మేకర్స్.. ఆ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ముఖ్యంగా అందులో బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఉగ్ర రూపంలో గంగమ్మ ఎంత భయంకరంగా ఉంటుందో.. అదే విధంగా బన్నీ కూడా ఉగ్రగంగమ్మ రూపంలో కనిపించి వావ్ అనిపించాడు. పట్టుచీరకట్టులో.. మెడలో నిమ్మకాయల దండతో.. ఒంటి నిండా బంగారు ఆభరణాలతో.. చేతికి గాజులు.. ముక్కుపుడకతో .. కాలీ మాతకు ప్రతీకలా దర్శనమిచ్చాడు బన్నీ. ఆయన నిల్చున్న తీరు.. కళ్లల్లో రౌద్రం చూస్తే.. శత్రువుల ఊచకోత ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. గంగమ్మ తల్లి అవతారంలో బన్నీ అచ్చం అమ్మవారి ఉగ్రరూపానికి ప్రతీకలా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో బన్నీ గంగమ్మ తల్లి అవతారంలో కనిపించడం ఏంటీ ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ అమ్మవారి చరిత్ర ఏంటీ అనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తిరుపతి ప్రాంతవాసులకు గంగమ్మ తల్లి గురించి …ఆ అమ్మవారి జాతర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర ఎలాగో.. అక్కడ గంగమ్మ తల్లి జాతర అంత ప్రసిద్ధి గాంచింది. జాతర జరిగే సమయంలో అమ్మవారికి మొక్ములు చెల్లించే క్రమంలో ఇలా వైవిధ్యమైన వేషధారణలో కనిపిస్తారు. దానిలో భాగంగాగానే కొందరు పురుషులు అమ్మవారిలా స్త్రీ వేషం ధరిస్తారు. ఇందుకు ఓ చరిత్ర ఉందట. అదెంటో తెలుసుకుందామా.

ఉగ్ర గంగమ్మ తల్లి కథ…

పూర్వకాలంలో తిరుపతి పరిసరాలలో ఆడవాళ్ల మీద అఘయిత్యాలు ఎక్కువగా జరిగేవంట. అయితే పాలెగోండులు గ్రామాలలోని ఆడవాళ్లని బలవంతంగా ఎత్తుకుపోయి అఘయిత్యాలు చేసేవారట. దీంతో ఆ గ్రామస్తులు భగవంతుడిని ఆరాధిస్తే.. గంగమ్మ అవతరించిందట. ఆమె పెరిగి పెద్దయ్యాక పాలెగోండులు ఆమె మీద కన్నేస్తారు. దీంతో ఆ తల్లి రాక్షస సంహారం మొదలు పెడుతుంది. ఆమెకు భయపడి వారంత అడవిలోకి పారిపోగా.. వారిని బయటకు రప్పించడం కోసం కొందరు మగాళ్లు ఇలా స్త్రీ వేషంలో అడవిలోకి వెళ్లి ఏడు రోజులలో వారిని బయటకు తీసుకురావడంతో..వారిని గంగమ్మ సంహరించిందట. అప్పటి నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ గంగమ్మ జాతరను ఏడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ జాతరలో మగాళ్లు గంగమ్మ తరహాలో వేషాలు వేసి సందడి చేస్తుంటారు. ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే.. అల్లు అర్జున్ కూడా ఇలా గంగమ్మ గెటప్ లో వచ్చి శత్రువులను సంహరించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.