యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇటీవలే అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో అర్జున్ కూతురి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరిగింది. ఈ వేడుకకు రజినీకాంత్ తోపాటు కమల్ హాసన్, స్టార్ నటీనటులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అర్జున్ తన కూతురికి ఎంత కట్నం ఇచ్చాడనే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే తన అల్లుడు ఉమాపతి రామయ్యతో అర్జున్ ఎంత సన్నిహితంగా ఉన్నాడో అంటూ కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సినిమాల్లో నటించిన అర్జున్.. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాగే అర్జున్ పూర్వీకులు కూడా సొంత గ్రామంలో అనేక ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. అర్జున్ పేరూరులో సొంతంగా ఆంజనేయ ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలోనే తన కూతురు వివాహన్ని జరిపించాడు. పేరూరులో జరిగిన వివాహ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 2023 అంచనాల ప్రకారం అర్జున్ సర్జా నికర విలువ 80 కోట్లు. అయితే తన పూర్వీకులు అందించిన ఆస్తి మొత్తాన్ని కూతురి పేరు మీదకు మార్చాడట అర్జున్. అలాగే బంగారు ఆభరణాలతోపాటు కోటి రూపాయాలకు పైగా విలువైన ఇంటిని కూతురికి బహుమతిగా అందించాడు. అయితే అర్జున్ కూతురికి ఇచ్చిన కట్నం గురించి ఎలాంటి అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా అర్జున్ తన అల్లుడు ఉమాపతిని పెళ్లి దుస్తుల్లో చూసి మురిసిపోయాడు. ఉమాపతి దుస్తులపై పూలు పడితే అర్జున్ మెడలో ఉన్న కండువాతో తుడిచాడు. చెమట పడితే మేకప్ చెరిగిపోకుండా అద్దాడు. చివరగా ఉమాపతి పెదాలను చేతులతో తాకి కిస్ చేశాడు. పెళ్లి కుమార్తె దుస్తుల్లో పక్కనే కూర్చున్న ఐశ్వర్య ఉమాపతిని తన తల్లిదండ్రులు అలా చూసుకోవడం చూసి మురిసిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.