
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు బన్నీ సినిమాల కోసం నార్త్ ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు కారణం పుష్ప. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేశాడు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో అర్జున్ పక్కా ఊర మాస్ లుక్ లో పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్, మేకోవర్, నటనకు ఉత్తరాది ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన పుష్ప 2 చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు షూటింగ్ లో పాల్గొంటున్నా.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు బన్నీ.
షూటింగ్స్ నుంచి కాస్త సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. తన కూతురు, కుమారుడితో సరదాగా గడుపుతున్న ఫోటోస్.. వీడియోస్ ఇన్ స్టాలో అభిమానులతో పంచుకుంటుంటారు. బన్నీకి ఇన్ స్టాలో దాదాపు 21 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ పర్సన్ ఎవరో తెలుసా ?.. మరెవరో కాదు.. తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే బన్నీ ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపూల్స్ జాబితాలో అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి జంట ఒకటి. ఇండస్ట్రీలో జరిగే పలు వేడుకలు తన ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తుంటారు బన్నీ. ఇక స్నేహారెడ్డి సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తమ పిల్లలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేయడమే కాకుండా.. బన్నీ పిక్స్ సైతం షేర్ చేస్తుంటారు స్నేహా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.