Tollywood: కేటరింగ్ చేసి హీరో స్థాయికి ఎదిగిన తెలుగు వ్యక్తి ఎవరో తెలుసా ?.. వెడ్డింగ్ ఈవెంట్స్.. షార్ట్ ఫిల్మ్స్ చేసి..
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న ఎంతో మందికి స్పూర్తి. ఆయన తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోస్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు హీరోగా వెండితెరపై అలరిస్తున్న హీరో ఒకప్పుడు కేటరింగ్ వర్క్ చేశాడట.

చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా స్థిరపడాలంటే అందం, టాలెంట్ ఉంటే సరిపోదు. కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. కానీ ఎప్పుడు లక్ తమను చేతుల్లోకి వస్తుందనేది మాత్రం అస్సలు చెప్పలేం. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతో మంది స్టార్ నటీనటులు ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని ఈ స్థితికి చేరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న ఎంతో మందికి స్పూర్తి. ఆయన తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోస్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అందులో ఈ హీరో ఒకరు. ఇప్పుడు హీరోగా వెండితెరపై అలరిస్తున్న అతడు ఒకప్పుడు కేటరింగ్ వర్క్ చేశాడట. నటుడిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మనీ కోసం కేటరింగ్, వెడ్డింగ్ ఈవెంట్స్, షార్ట్ ఫిల్మ్ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతడు ఎవరు అనుకుంటున్నారా ?.. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్.
తెలంగాణలోని సింగరేణి ప్రాంతానికి చెందిన ఓ మాములు అబ్బాయి నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టి ఆట తీరు.. ప్రవర్తనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు ఛాన్సులు అందుకుంటున్నాడు. బిగ్ బాస్ ఐదో సీజన్ ద్వారా జనాల్లో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో సాహసమే చేశాడు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సోహైల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇటీవలే బూట్ కట్ బాలరాజు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు.
కానీ సినిమాల్లోకి రాకముందు సోహైల్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాల కంటే ముందు తాను షార్ట్ ఫిల్మ్స్ చేశానని.. ఆ తర్వాత సీరియల్స్ చేశానని అన్నాడు. అంతకు ముందు డబ్బుల కోసం కేటరింగ్ వర్క్ చేశానని.. వెడ్డింగ్ ఈవెంట్లలో క్యూ మెంబర్ గా పనిచేశానని అన్నారు. కొత్త బంగారు లోకం సినిమా నుంచి స్టార్ట్ చేస్తే సీరియల్స్, కేటరింగ్, వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ బిగ్ బాస్ వరకు వచ్చానని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
