
టాలీవుడ్ గుడ్ లుకింగ్ హీరోల లిస్ట్ తీస్తే.. అందులో ఫస్ట్ లైన్‌లో ఉంటాడు నాగశౌర్య. ఈయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. మధ్యలో మాస్ హీరో ఇమేజ్ కోసం యాక్షన్ సినిమాలు చేశాడు కానీ పెద్దగా వర్కువుట్ అవ్వలేదు. శౌర్య నటించిన నారీ నారీ నడమ మురారీ, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే నాగశార్య మేనత్త ఓ తెలుగు సినిమాల్లో నటించిన ఫేమస్ నటి అని తెల్సా..? అవునండీ.. ఆమె చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె పేరు లత శ్రీ. నాగశౌర్య తండ్రికి ఈమె స్వయానా చెల్లెలు. ‘యమలీల’ సినిమాలోని ‘అభివందనం యమరాజా..’ అంటూ ఆడిపాడిన నటీమణే ఈ లత శ్రీ. ఆ ఒక్కటీ అడక్కు, నెంబర్ వన్, జంపలకిడి పంబ.. వంటి విజయవంతమైన సినిమాల్లో ఆమె నటించారు. పలు దక్షిణాది భాషల్లో ఈమె.. సుమారు 70 కిపైగా చిత్రాల్లో నటించారు. జిమ్ ట్రైనర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత.. 1999 నుంచి సినిమాల్లో కనిపించలేదు.
2007లో ఈవీవీ సత్యనాారణయ తీసిన ‘అత్తిలి సత్తిబాబు’ చిత్రంలో తిరిగి మళ్లీ ఇండస్ట్రీకి వచ్చినా .. పెద్దగా సక్సెస్ మారలేదు. ఇప్పుడు కూడా నటనకు దూరంగానే ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు తనయులు ఉన్నారు. ఇద్దరూ బీటెక్ గ్రాడ్యూయేట్స్. అయితే నాగశౌర్య కుటుంబ తనను పట్టించుకోరని గతంలో పలు ఇంటర్య్వులలో లత శ్రీ చెప్పుకొచ్చారు. తనంటే వారికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అన్నయ్య సొంతవాడే.. మేనల్లుడు సొంతవాడే.. కాని వదిన మన వాళ్లు అవ్వరు కదా అని ఆమె బాదను వ్యక్తపరిచారు.
తన అల్లుడు నాగశౌర్య అంటే ఇష్టమేనని.. అతని చేసిన మూవీస్ కూడా చూస్తానని చెప్పింది లత శ్రీ. శౌర్య ఫ్యామిలీతో చిన్న చిన్న అభిప్రాయ బేదాలు వచ్చాయని చెప్పిన లత శ్రీ.. అందుకు గల రీజన్స్ మాత్రం వెల్లడించలేదు. నాగశౌర్య ఇంట్లో జరిగిన ఏ శుభకార్యాల్లోనూ లత శ్రీ కనిపించలేదు.
Latha Sree
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.