
చరణ్ రాజ్.. పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. తెలుగు సినిమాల్లో ఆయన పండించిన విలనిజాన్ని ఎవరూ అం ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా 90స్ కిడ్స్‌కు ఈ స్టార్ విలన్ గురించి బాగా తెలుసు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించాడు చరణ్ రాజ్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ప్రతిఘటన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతను మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. విజయశాంతికి ధీటుగా విలనిజాన్ని పండించి ప్రశంసలు అందుకున్నాడు.ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా ఆకట్టుకున్నాడు. అరణ్యకాండ, దొంగ మొగుడు, స్వయంవరం, భలే దొంగ, స్టూవర్ట్ పురం దొంగలు, సూర్య ఐపీఎస్, నా అల్లుడు, అతడు, అసాధ్యుడు, కరెంట్, కొమరం పులి, పరమవీర చక్ర, అధినాయకుడు, పైసా, నరకాసుర, ఆపరేషన్ రావణ్, లాల్ సలామ్, నరకాసుర.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు చరణ్ రాజ్.
కాగా సినిమాల పరంగా తప్పితే చరణ్ రాజ్ ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అలాగే చరణ్ కుమారుడు కూడా ఇప్పటికే సినిమాల్లో నటిస్తోన్న విషయం కూడా తెలియదు. చరణ్ రాజ్ కుమారుడి పేరు తేజ్ చరణ్ రాజ్. 2017లో తమిళంలో వచ్చిన లాలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడీ స్టార్ కిడ్. ఆ తర్వాత 90ml శ్రీ భారత బాహుబలి అనే తమిళ్ సినిమాల్లోనూ నటించాడు. సివి 2 అనే కన్నడ సినిమాలోనూ మెరిశాడు. ఇక 2023లో రిలీజైన నరకాసుర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించాడు చరణ్ రాజ్. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగులో మరో సినిమా చేయలేదు తేజ్. అయితే అప్పుడుప్పుడు సినిమా ఈవెంట్లు,సోషల్ మీడియాలో ఈ స్టార్ కిడ్ కనిపిస్తున్నాడు. తన తర్వాతి సినిమాపై ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది.
#Superstar #Rajinikanth launched the audio of his former co-star Charan Raj’s son Tej Charan Raj’s debut movie #Laali pic.twitter.com/nElz5z3jAQ
— Theeejay (@theeejay) April 17, 2017
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.