Ajith Kumar : రూ. 25 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్.. స్పోర్ట్స్ బైక్స్, కార్లు.. హీరో అజిత్ ఆస్తులు తెలిస్తే..

తమిళ సినీరంగంలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ అబ్బాయి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్నాడు అజిత్.

Ajith Kumar : రూ. 25 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్.. స్పోర్ట్స్ బైక్స్, కార్లు.. హీరో అజిత్ ఆస్తులు తెలిస్తే..
Ajith Kumar

Updated on: May 02, 2025 | 1:28 PM

అజిత్ కుమార్ తమిళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద స్టార్లలో ఒకరు. 1990లో ‘ఎన్ వీడు ఎన్ కనవర్’ చిత్రంతో అరంగేట్రం చేశారు. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటన, లుక్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ముఖ్యంగా మహిళలు, యూత్‏లో ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నారు. అజిత్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ పురస్కారం అందించింది. ప్రస్తుతం అజిత్ ఒక్కో సినిమాకు రూ.105 కోట్ల నుండి రూ.165 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు. నటుడిగానే కాకుండా అజిత్ ఒక ప్రొఫెషనల్ కార్ రేసర్ కూడా. అతడికి కార్లు, బైక్స్ అంటే విపరీతమైన ఇష్టం. అజిత్ విలాసవంతమైన జీవనశైలిని గడుపుతాడు. ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఏకైక హీరో అతడే.

అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఒక విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్నారు. ఆ ఇంటి విలువ రూ. 12 నుండి 15 కోట్లు. అజిత్ సముద్రతీర బంగ్లాలో స్విమ్మింగ్ పూల్, హైటెక్ జిమ్ ఉన్నాయి. కోలీవుడ్ హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అజిత్. వీరికి బాబు అద్విక్, కూతురు అనౌష్క ఉన్నారు. అజిత్ ఆస్తులు రూ.350 కోట్లు. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం ఆ ప్రైవేట్ జెట్ విలువ రూ.25 కోట్లు. అజిత్ బైక్ ప్రియుడు. ఆయన వద్ద BMW S1000 RR, అప్రిలియా కాపోనార్డ్, BMW K1300 S వంటి కొన్ని హై-ఎండ్ బైక్స్ ఉన్నాయి. వీటి ధర రూ. 10-15 లక్షల మధ్య ఉంటుంది.

నివేదిక ప్రకారం, అజిత్ కు రూ.36 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో రూ.34 కోట్ల విలువైన లంబోర్గిని, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ఉన్నాయి. అజిత్ 1999లో ‘అమర్కాలం’ సెట్స్‌లో షాలినిని కలిశాడు. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు 2000లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు అజిత్.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..