పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అమ్మతో కలిసి ఫోటో దిగిన ఈ చిన్నారి ఓ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడు.. ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్ళాడింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా, తన కుటుంబాన్ని చూసుకుంటోంది. ఆమెవరో గుర్తుపట్టారా.? ఆమె భర్త ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్.. రెండు సినిమాలతో యావత్తు దేశవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ సంపాదించాడు. మాస్‌లో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టగలిగారా.? లేదా మేమే చెప్పేయమా..
ఆమె మరెవరో కాదు.. కన్నడ స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా హీరో యశ్ భార్య రాధిక పండిట్. 2008లో ‘మొగ్గిన మనసు’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రాధిక. ఈ మూవీలో హీరోగా ఆమె భర్త యశ్ నటించారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రాధిక పండిట్.
ఇక ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ సినిమాతో హీరో యశ్‌తో ప్రేమలో పడింది. ఇద్దరికీ పెద్దల అంగీకారంతో 2016లో పెళ్లి జరిగింది. సుమారు 20కిపైగా సినిమాల్లో నటించిన రాధిక పండిట్.. 2019లో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమై.. కుటుంబాన్ని చూసుకుంటోంది. యశ్, రాధిక దంపతులకు ఇద్దరు సంతానం. అటు పిల్లలను, కుటుంబాన్ని చూసుకుంటూ.. అప్పుడప్పుడూ భర్తతో కలిసి పలు యాడ్స్ చేస్తూ.. అలాగే భర్త లుక్స్‌కు సంబంధించిన విషయాల్లోనూ కేర్ తీసుకుంటూ రాధిక ఫుల్ బిజీగా ఉన్నారు.