తెలుగు అర్థంకాదని నా గురించి చాలా సార్లు తప్పుగా మాట్లాడారు.. హీరో, డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దివ్య భారతి

జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో... క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ G.O.A.T . ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు.

తెలుగు అర్థంకాదని నా గురించి చాలా సార్లు తప్పుగా మాట్లాడారు.. హీరో, డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దివ్య భారతి
Divya Bharathi

Updated on: Dec 02, 2025 | 9:06 PM

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. కమెడియన్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న సినిమా గోట్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కు హీరోయిన్, నీరంతా హాజరయ్యారు. ప్రొడ్యూసర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియా ద్వారా టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి థాంక్స్‌. నా రెండు సినిమాలకు మంచి రివ్యూస్ వచ్చాయి. అద్భుతం, టెనెంట్‌ను బాగా ఆదరించారు. రివ్యూల వల్ల సినిమా మేకర్స్‌లో బాధ్యత పెరుగుతుంది. రివ్యూవర్లు మీరు ఇలాగే ఉండండి.. కొన్ని డిస్ట్రబెన్సెస్ వల్ల సినిమాను మధ్యలో కొద్ది రోజులు ఆపి మళ్లీ చేశాం. సెకండాఫ్ కథ సెట్ కాకపోవటం, గతంలో ఉన్న దర్శకుడు ప్రయత్నించిన సెట్ కాలేదు
ముందున్న టీమ్‌ కలిసి వర్క్ చేయలేదు. అందుకే ఆ టీమ్‌ను మార్చి… కొత్త వారితో వర్క్ చేశాను కొత్త టీమ చాలా కష్టపడి సినిమాను పూర్తి చేసింది అని చెప్పుకొచ్చాడు నిర్మత.

ఇది కూడా చదవండి : 10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.

అలాగే కళామతల్లే ఈ సినిమాను పూర్తి చేయించుకుంది. దివ్యభారతి ఈ సినిమాను ఒప్పకోవటమే పెద్ద విషయం.. డేట్స్ సరిగా వాడకపోయినా… ఆమె ఎప్పుడూ ఏమీ అనలేదు.. దివ్యభారతికి జరిగిన ఇబ్బందికి స్టేజ్ మీద సారి చెప్పాడు నిర్మాత. మ్యూజిక్ విషయంలో మణిశర్మ గారు చాలా హెల్ప్ చేశారు. మా పరిస్థితి చూసి ఆయన తక్కువ పేమెంట్ తీసుకున్నారు
త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు నిర్మత.. హీరోయిన్ దివ్య భారతి మాట్లాడుతూ..
తమిళ్‌లో బ్యాచిలర్ ఎంత మంది డెబ్యూనో తెలుగులో గోట్‌ కూడా లాంటి మూవీ అవుతుంది అనుకున్నా… అందుకే ఓకే చెప్పా.. సుదీర్‌ గారు మల్టీటాలెంటెడ్ యాక్టర్‌. ఆయన జర్నీ ఇన్‌స్పైరింగ్‌, ప్రొడ్యూసర్స్ సినిమాకు సంబంధించి ప్రతీ డిటైలింగ్‌ను జాగ్రత్తగా చూసుకున్నారు అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?

అలాగే ఆమె మాట్లాడుతూ.. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను నిలబడ్డాను.. అందుకే దర్శకుడు ఇబ్బంది పెట్టడం గురించి ట్వీట్ చేశాను. అందులో సుధీర్‌ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే.. ఆయన చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా లో నన్ను ఐటమ్ సాంగ్ చేయమని అడిగారు. అప్పటికే ఇష్యూ ఉన్నప్పుడు కావాలని నన్ను మళ్లీ మళ్లీ పోక్ చేయటం నాకు నచ్చలేదు. సినిమా స్టార్టింగ్‌లోనూ కూడా నాకు తెలుగు అర్ధం కాదని చాలా సార్లు తప్పుగా మాట్లాడారు. వ్యక్తిగతంగా దర్శకుడు, హీరోతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కామెడీ జానర్‌ కావటంతో ఫస్ట్ టైమ్‌ కదా అని ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమాకు ఓకే చెప్పా.. అప్పటికి దర్శకుడి గురించి, సుధీర్ గురించి ఏం తెలియదు. సెట్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరికే కూర్చోబెట్టేవారు. డైరెక్టర్‌ మైక్‌లో ఒక షాట్ తరువాత ఈ అమ్మాయిని ఎంత అందంగా చూపించాలి అనుకున్న అందంగా కనిపించటం లేదు అన్నారు. దర్శకుడు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే వర్క్ బాగుండదు
కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు. వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్ చేయటం వల్లే నేను బయటకు రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది దివ్యభారతి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .