Divi Vadthya: రియాలిటీ షో బిగ్ బాస్ చాలా మందిని లైమ్ లైట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గేమ్ షోతో చాలా మంది పాపులర్ అయ్యారు. అందాల భామతో బిగ్ బాస్‌తో మంచి ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ఆ లిస్ట్‌లో వయ్యారి భామ దివి ఒకరు. బిగ్ బాస్‌కు ముందు చిన్నా చితక సినిమాల్లో నటించిన దివి. ఇప్పుడు హీరోయిన్‌గా మారడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ అమ్మడు నాగార్జున ఘోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్4లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందంతో అల్లరితో కట్టిపడేసిన దివి బిగ్ బాస్ హౌస్ కే గ్లామర్‌ను తెచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ లో కీలక పాత్రకు గాను ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ అమ్మడికి అదిరిపోయే మరో ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో దివికి ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో దివి ఓ ముఖ్యమైన పాత్రలో నటించనుందట. మరి బంగార్రాజు సినిమాలో దివి నటిస్తుందా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఈ అమ్మడికి ఛాన్స్ వస్తే తప్పకుండా దివి కెరీర్‌కు బంగార్రాజు సినిమా ప్లెస్ అవుతుందనే చెప్పాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :