Dhanush’Jagame Thanthram’ : స్టార్ దర్శకుడి పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదేనా..?

|

Feb 20, 2021 | 5:16 PM

తమిళస్టార్ ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘జగమే తంతిరమ్'  డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్ కెరీర్ లో ఇది 40వ సినిమా..

DhanushJagame Thanthram : స్టార్ దర్శకుడి పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న డిస్టిబ్యూటర్స్.. కారణం ఇదేనా..?
Follow us on

Jagame Thanthram : తమిళస్టార్ ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘జగమే తంతిరమ్’  డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్ కెరీర్ లో ఇది 40వ సినిమా. తెలుగులో ”జగమే తంత్రం” అనే టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాలో ధనుష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ ధనుష్ కు జోడీగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. కానీ ఇంతవరకు విడుదల తేదీని ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో ”జగమే తంత్రం” సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని గతంలో వార్తలు వినిపించాయి. ఆ వార్తలను ఖండించింది చిత్రయూనిట్ తాజాగా మరో సారి ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందని వార్తలు ఫిలింసర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుందని తెలుస్తుంది. అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గతంలో కొన్ని సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఇప్పుడు కూడా ఓటీటీ వైపే అడుగులు వేయడంతో కొంతమంది డిస్టిబ్యూటర్స్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Buchi Babu Sana : మహేష్ సినిమాకు క్లాప్ కొట్టిన ఉప్పెన దర్శకుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో…