AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్‌తో బ్లాక్‌బస్టర్ సినిమా చేయ్.! పరిటాల రవి చెప్పినా.. నో చెప్పిన కొడాలి నాని.. ఎందుకంటే

కొడాలి నాని, ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి దర్శకుడు వి.వి. వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎన్టీఆర్‌ను స్టార్‌గా చేయాలన్న నాని ఆశయంతో పాటు, పరిటాల రవి కోరినా ఎన్టీఆర్‌ సినిమాను నాని ఎందుకు తిరస్కరించారో వెల్లడించారు. నాని మొండి స్వభావాన్ని, ఆయనకు, ఎన్టీఆర్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా వినాయక్ ప్రస్తావించారు.

ఎన్టీఆర్‌తో బ్లాక్‌బస్టర్ సినిమా చేయ్.! పరిటాల రవి చెప్పినా.. నో చెప్పిన కొడాలి నాని.. ఎందుకంటే
Vv Vinayak (1)
Ravi Kiran
|

Updated on: Mar 30, 2026 | 11:05 AM

Share

టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, అలాగే సినిమాలకు ఎందుకు దూరమైన విషయాన్ని.. అలాగే కొడాలి నాని, ఎన్టీఆర్‌ల మధ్య అనుబంధంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆది” చిత్రం విడుదలై 20 ఏళ్లు గడిచాయని, త్వరలో మరో మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుత కాలంలో హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, రొటీన్ కథలను తాను ఎంచుకోవడానికి ఇష్టపడటం లేదని వినాయక్ వెల్లడించారు. ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ స్థాయికి తగ్గ కథలు లేకపోతే, అలాంటి వాటిని తీయడం ఎందుకని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కొడాలి నానికి ఎన్టీఆర్‌ను ఒక పెద్ద స్టార్‌గా చేయాలనే గొప్ప ఆశయం ఉండేదని వినాయక్ వివరించారు. సొంత అన్నకు కూడా అంత ఆశయం ఉండదని ఆయన అన్నారు. ఒకానొక సందర్భంలో పరిటాల రవి తారక్‌తో సినిమా చేయమని కొడాలి నానిని కోరినప్పుడు, నాని దానిని నిరాకరించారని వినాయక్ గుర్తుచేసుకున్నారు. కథ నచ్చకపోవడం లేదా ఆయన చెప్పిన డైరెక్టర్ నచ్చకపోవడం వల్ల కావచ్చు, తన కెరీర్‌కు అది ముఖ్యం అని నాని భావించారని, అందువల్లే ఆ ప్రతిపాదనను వద్దు అన్నారని వినాయక్ తెలిపారు. కొడాలి నాని చాలా మొండి స్వభావం కలవారని, నో అంటే నో అనే రకం అని ఆయన పేర్కొన్నారు. అదుర్స్ సినిమాకు కొడాలి నాని, వంశీ నిర్మాతలని, వారితో తన అనుబంధం బాగుంటుందని వినాయక్ చెప్పారు. పార్టీలు మారినంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు మారవని, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో పెద్దగా కలవకపోయినా, ఫోన్లో మాత్రం మాట్లాడుకుంటారని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్‌తో తన బాండింగ్ చాలా బాగుంటుందని, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్నేహం కొనసాగుతుందని వినాయక్ ధృవీకరించారు. తాను ఎవరితోనూ సన్నిహితంగా ఉండనని, ఎక్కడికీ వెళ్లి కలవాలని కోరుకోనని, వారు పిలిస్తేనే వెళ్తానని తన వ్యక్తిత్వాన్ని వివరించారు. ప్రభాస్ నిరాడంబరతను ప్రత్యేకంగా ప్రస్తావించిన వినాయక్, ప్రభాస్ పెద్ద స్టార్ అయినా, స్నేహితుల దగ్గరకు వచ్చేసరికి అస్సలు ఆ స్టార్‌డమ్ చూపించరని తెలిపారు. తనకు ఇష్టమైనప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి ప్రభాస్ స్వయంగా ఫోన్ చేసి కలుస్తారని, గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటారని వినాయక్ పేర్కొన్నారు.

Follow Us