
టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను అందిస్తున్నారు డైరెక్టర్ వీ.ఐ ఆనంద్. టైగర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. తన డైరెక్షన్, స్క్రీన్ ప్లేతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఇందులో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఊ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ సందర్భంగా సోమవారం విలేకరులతో ముచ్చటించిన ఆయన.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తో వీ.ఐ ఆనంద్ సినిమా ఉంటుందని ప్రచారం నడిచింది. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడదే విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా.. సమాధానాలు ఇచ్చారు డైరెక్టర్. “కొన్ని నెలలపాటు అల్లు అర్జున్ తో కథా చర్చలు జరిగిన మాట నిజమే. కానీ మా కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటికే బన్నీకి కొన్ని కథలను చెప్పాను. కానీ ఇంకాస్తత పెద్ద కథ.. ఆసక్తి ఉన్న స్టోరీ కావాలని అడిగారు. అప్పుడు అలాంటి కథలు రాయలేదు. తర్వలోనే బన్నీని కలుస్తాను. ఆయనతో భవిష్యత్తులో ఉండొచ్చు. ఊరు పేరు భైరవకోన సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో నలుగురు స్నేహితులు నేపథ్యంలో ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ అందులో పోషించాల్సిన నటీనటులు డేట్స్ కుదరడం లేదు. నిఖిల్ కథానాయకుడిగా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాను. అలాగే మరో స్టార్ హీరోతో యాక్షన్ సినిమా చేయబోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
టైగర్ తర్వాత సందీప్ కిషన్ తో మరో సినిమా చేయాలనుకున్నామి.. డిస్కోరాజా తర్వాత ఈ కథ రాసుకునే సమయం దొరికిందని అన్నారు. ఊరుపేరు భైరవకోన ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుందని భావించి అప్పుడే రంగంలోకి దిగామని.. సందీప్ ఇప్పటివరకు ఇలాంటి తరహా సినిమాలు చేయలేదని అన్నారు. గరుడ పురాణంలోని కొన్ని ప్రకరణల స్పూర్తితో రాసుకున్నదే ఈ మూవీ స్టోరీ అని.. పుట్టుక, మరణాలపై చాలా ఆసక్తి అని.. చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో ఉందని అన్ని అన్నారు. కర్మ సిద్ధాంతంతో సహల పలు విషయాలు ఈ కథలో ఉంటాయని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.