Venu Udugula: సాయి పల్లవి అసాధారణ నటి.. పాత్ర కోసం ఆహారం తీసుకోలేదు.. డైరెక్టర్ వేణు ఉడుగుల కామెంట్స్ వైరల్..

|

May 30, 2022 | 8:38 AM

క్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో కనిపంచనుండగా.. అతని ప్రేమ కోసం అడవి బాట పట్టిన వెన్నెల అనే అమ్మాయి అనే పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి.

Venu Udugula: సాయి పల్లవి అసాధారణ నటి.. పాత్ర కోసం ఆహారం తీసుకోలేదు.. డైరెక్టర్ వేణు ఉడుగుల కామెంట్స్ వైరల్..
Virata Parvam
Follow us on

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వేణు ఉడుగుల (Venu Udugula) తెరకెక్కిస్తున్న చిత్రం విరాటపర్వం. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో కనిపంచనుండగా.. అతని ప్రేమ కోసం అడవి బాట పట్టిన వెన్నెల అనే అమ్మాయి అనే పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ వేణు ఉడుగుల.

1990 నాటి గాఢమైన ప్రేమ కథ. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో మనకు బాగా కావాల్సిన వారు చనిపోతే ఎలాంటి బాధ ఉంటుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అదే భావోద్వేగానికి లోనవుతారు.. ఈ సినిమాలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. నేను అలాంటి సమాజంలోనే పుట్టాను.. వరంగల్ మాది.. అక్కడ సమస్యలు, విప్లవాలు నాకో భిన్నమైన దారిని చూపాయి.. అంతేకాకుండా.. నేను చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావమూ ఈ సినిమాపై పడ్డాయేమో.. నక్సల్స్ జీవితాలు ఎలా ఉంటాయో నాకు చినప్పటి నుంచే అనుభవం ఉంది. ఇంట్లో నుంచి చూస్తే నక్సల్స్, పోలీసుల ఎన్ కౌంటర్స్ కనిపిస్తుండేవి.. వాటిని నేను ప్రత్యేక్ష సాక్షి.. అందుకే ఎలాంటి రిసెర్చ్ చేయకుండానే కథ రాసుకున్నాను..

ఇవి కూడా చదవండి

నిజామాబాద్ కు చెందిన శంకరన్న అనే వ్యక్తి స్పూర్తిగా తీసుకుని రానా పాత్రను రాశాను.. ఆ పాత్రకు రవన్న అని పెట్టాను.. ఈ పాత్ర కోసం ముందుగా రానాను కలిశాను.. ఎవరికీ స్క్రీప్ట్ వినిపించలేదు.. సామాజిక స్పృహ, వాస్తవికతను తెరపైకీ తీసుకురావాలనే ఆకాంక్ష..అన్ని లక్షణాలున్న నటుడు రానా. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రకు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం ఉంది.. అనుకున్నదాని కంటే మంచి జౌట్ పుట్ ఇచ్చారు.. ఇక లుక్స్, నటన పరంగా పాత్రలో ఒదిగిపోయింది సాయి పల్లవి.. ఆమె అసాధారణ నటి.. అంకిత భావంతో పనిచేస్తుంది. పాత్రకు తగ్గ అవతారంలోకి మారేందుకు ఓరోజు ఆహారం కూడా తీసుకోలేదు. ఈ చిత్రంలో ఆమె వెన్నెల అనే పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి తెలుగు, మలయాళం, తమిళంలోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. హిందీ గురించి ఇంకా ఆలోచించలేదు అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ వేణు ఉడుగుల.