Venkatesh Maha: ‘వదిలేస్తే మాట వినరుగా.. ఇక ఊరుకోను’.. ట్రోలింగ్స్ పై డైరెక్టర్ వెంకటేశ్ మహా సీరియస్..

తాజాగా డైరెక్టర్ వెంకటేశ్ మహా ట్రోల్స్ పై సీరియస్ అయ్యాడు. వదిలేస్తే మాట వినరుగా మీరు.. ఇక ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది ? అనేది చూద్దాం. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. మృణాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈమూవీలో నాని, మృణాల్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ సైతం హాయ్ నాన్న సినిమా తనకెంతో నచ్చిందంటూ రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Venkatesh Maha: వదిలేస్తే మాట వినరుగా.. ఇక ఊరుకోను.. ట్రోలింగ్స్ పై డైరెక్టర్ వెంకటేశ్ మహా సీరియస్..
Director Venkatesh Maha

Updated on: Dec 12, 2023 | 10:59 AM

సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల పై ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది. సినిమాల గురించి చాలాసార్లు విమర్శలు వచ్చినప్పటికీ.. కొన్నిసార్లు పర్సనల్ విషయాల పై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తుంటారు. అయితే చాలా మంది సినీ ప్రముఖులు తమ గురించి వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చూసి చూడనట్లు వదిలేసుంటారు. కొందరు మాత్రం తమ స్టైల్లో స్ట్రాంగ్‏గానే రియాక్ట్ అవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ వెంకటేశ్ మహా ట్రోల్స్ పై సీరియస్ అయ్యాడు. వదిలేస్తే మాట వినరుగా మీరు.. ఇక ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది ? అనేది చూద్దాం. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. మృణాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈమూవీలో నాని, మృణాల్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి.

ఇప్పటికే అల్లు అర్జున్ సైతం హాయ్ నాన్న సినిమా తనకెంతో నచ్చిందంటూ రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ వెంకటేశ్ మహా సైతం హాయ్ నాన్న పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. హాయ్ నాన్న సినిమా చూశానని.. తనకు చాలా బాగా నచ్చిందని అన్నారు. హీరో నాని కథలను ఎంపిక చేసుకునే తీరు స్పూర్తిగా నిలుస్తుందని..ఈ సినిమాలో నటించిన వారికి, టెక్నికల్ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు వెంకటేశ్ మహా. ఈ ట్వీట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. డైరెక్టర్ వెంకటేశ్ మహాను విమర్శించాడు. తీసింది ఒక్క సినిమా.. పైగా కేజీఎఫ్ బాగలేదంటాడు అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన వెంకటేశ్ మహా రియాక్ట్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

“వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెబుతున్నా వినండి. ఎన్ని సినిమాలు తీసామనేది కాదు ముఖ్యం ఏం సినిమా తీసాం అనేది ముఖ్యం. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను తెలుగులో కొన్ని బెస్ట్ సినిమాలు తీసాను అని గర్వంగా చెప్పుకుంటాను. భవిష్యత్తులో తీస్తా. ఊరుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే .. ఇక ఊరుకోను. ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఇలా కామెంట్ చేసేవారిపై వ్యక్తిగతంగా, న్యాయపరంగానూ పోరాడతానని.. తనకు మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరారు. ప్రస్తుతం వెంకటేశ్ మహా ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా..నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.