అందంగా లేదు ఆమె హీరోయిన్ ఏంటీ అన్నారు.. కట్‌చేస్తే ఆమెతోనే బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు వంశీ

దర్శకుడు వంశీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు వంశీ. కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో పాటు ఎమోషనల్ డ్రామాలు కూడా తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు వంశీ. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అందంగా లేదు ఆమె హీరోయిన్ ఏంటీ అన్నారు.. కట్‌చేస్తే ఆమెతోనే బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు వంశీ
Director Vamsy

Updated on: Dec 29, 2025 | 10:59 AM

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. తమ మార్క్ తో ప్రేక్షకులను అలరించిన వారిలో దర్శకుడు వంశీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్స్ అందించి ప్రేక్షకులను మెప్పించారు వంశీ. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు వంశీ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వంశీ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వంశీ, నటి భానుప్రియతో తన ప్రయాణం గురించి, ఆమె నటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే హీరో వెంకటేష్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. వెంకటేష్ ను హీరోగా అనుకున్న ఒక సినిమా ఆగిపోవడానికి గల కారణాల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన చిత్రాలలో హీరోయిన్లలో భానుప్రియనే అత్యంత అందమైన అమ్మాయి అని వంశీ అన్నారు. ఆమెను హీరోయిన్‌గా ఎంచుకున్న తొలినాళ్లలో చాలామంది, తన కెమెరామెన్ హరి అనురాగ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని వంశీ గుర్తుచేసుకున్నారు. భానుప్రియ రంగు తక్కువగా ఉందని, మరో అమ్మాయి కల్పనను ఎంచుకోమని చాలా మంది చెప్పారు. కానీ తన మనసులో భానుప్రియనే సరైన ఎంపిక అని బలంగా నమ్మాను అని తెలిపారు. అయితే నిర్మాతలను ఒప్పించడానికి, భానుప్రియ ఫోటోసెషన్‌లో తీసిన ఫోటోలు పెద్ద ప్రింట్లను ప్రొడ్యూసర్స్ ఇంట్లో ఉంచాను. ఒకసారి అక్కడికి వచ్చిన దర్శకుడు కె. విశ్వనాథ్, భానుప్రియ ఫోటోలను చూసి “భలేగా ఉందోయ్” అని ప్రశంసించడంతో, నిర్మాతలకు ఆమెపై నమ్మకం కుదిరిందని వంశీ అన్నారు. దాంతో ఆమెను హీరోయిన్ గా పెట్టి సితార అనే సినిమా చేశారు వంశీ.

సితార సినిమా తర్వాత భానుప్రియ బిజీ అయ్యారని, అయితే ఆమెకు మోడరన్ డ్రెస్సులు వేసే పాత్రలు దక్కడం లేదని తెలుసుకుని, తన అన్వేషణ సినిమాలో ఆమెను మోడరన్ దుస్తులలో చూపించానని తెలిపారు వంశీ. ఆ తర్వాత ప్రేమించి పెళ్లాడులో చీరకట్టు, పెద్ద బొట్టుతోనూ, ఆలాపనలో క్లాసికల్ డాన్సర్‌గానూ ఆమెను చూపించానని, ఆలాపన తన దర్శకత్వంలో భానుప్రియ నటించిన ఆఖరి చిత్రమని పేర్కొన్నారు. భానుప్రియతో తదుపరి చేయాలనుకున్న గాలికొండపురం రైల్వే గేట్ అనే సినిమా ఆగిపోవడానికి గల కారణాలను వంశీ తెలిపారు. ఈ చిత్రానికి వెంకటేష్‌ను హీరోగా అనుకున్నారు. లతా మంగేష్కర్ మూడు పాటలు పాడగా, ఇళయరాజా, వేటూరి వంటి ప్రముఖులు కూడా పనిచేశారు. కథను వెంకటేష్ తండ్రి రామానాయుడు గారికి వేమూరి సత్యానారాయణ వివరించారు. కథ విన్న తర్వాత రామానాయుడు గారు, “ఇది హిచ్‌కాక్ సినిమా లాంటిది. హీరోయిన్‌కు లేదా దర్శకుడికి పేరొస్తుంది, మా అబ్బాయికి కమర్షియల్ ఇమేజ్‌కు ఇది సరికాదు” అని చెప్పి సినిమాను తిరస్కరించారు. దీంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వంశీ తెలిపారు. తర్వాత భానుప్రియకు బదులుగా విజయశాంతిని కూడా అనుకున్నప్పటికీ, సినిమా పట్టాలెక్కలేదని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.