Director Upendra: భోజనం కోసం వెళ్తే దారుణంగా అవమానించాడు.. డైరెక్టర్ ఉపేంద్ర కామెంట్స్..

|

Mar 17, 2024 | 7:16 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భిన్నంగా ఆలోచించే దర్శకుడు ఆయనే. . నటనలోనూ, దర్శకత్వంలోనూ స్టార్‌గా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఉపేంద్ర ఒకరు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ అయినా.. ఆయన సినీ ప్రయాణం పూలబాట కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చిన ఉపేంద్రకు మొదట్లో చాలా అవమానాలు ఎదురయ్యాయి. గతంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపేంద్ర.. తొలి నాళ్లలో తనకు ఎదురైన అవమానాలను గుర్తుచేసుకున్నారు.

Director Upendra: భోజనం కోసం వెళ్తే దారుణంగా అవమానించాడు.. డైరెక్టర్ ఉపేంద్ర కామెంట్స్..
Upendra
Follow us on

కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట్ర ఉపేంద్ర. ఇప్పుడున్న స్టార్ నటీనటులు ఆయన చిత్రాలకు.. ఆయన దర్శకత్వం వీరాభిమానులు. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉపేంద్రకు పెద్ద అభిమాని. ఆయన డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకోచ్చాడు నీల్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భిన్నంగా ఆలోచించే దర్శకుడు ఆయనే. . నటనలోనూ, దర్శకత్వంలోనూ స్టార్‌గా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో ఉపేంద్ర ఒకరు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ అయినా.. ఆయన సినీ ప్రయాణం పూలబాట కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చిన ఉపేంద్రకు మొదట్లో చాలా అవమానాలు ఎదురయ్యాయి. గతంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపేంద్ర.. తొలి నాళ్లలో తనకు ఎదురైన అవమానాలను గుర్తుచేసుకున్నారు. ప్లేట్ పట్టుకుని భోజనం కోసం నిలబడితే ప్రొడక్షన్ ఆవమానించాడని అన్నారు.

“మొదట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఒకసారి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న సమయంలో భోజనం కోసం ప్లేట్‌తో నిల్చున్నాను. అప్పుడు భోజనం వడ్డిస్తున్న ప్రొడక్షన్‌కు చెందిన ఒక వ్యక్తి భోజనం పెట్టను పక్కకు వెళ్లిపో అన్నాడు. ఇలాంటి రోజులు.. అవమానాలు చాలా ఎదురయ్యాయి. ఆ తర్వాత నేను హీరోగా నటించడం ప్రారంభించిన తర్వాత అదే వ్యక్తి నా సెట్ కు వచ్చి భోజనం వడ్డించాడు. నేను అప్పుడు.. ఇప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాను. అందుకు కారణం కూడా ఉంది. అతడు నన్ను అవమానించినప్పుడు నాకు ఎలాంటి గుర్తింపు లేదు. నేను హీరోగా మారిన తర్వాత గతాన్ని గుర్తుపెట్టుకుని ఆయనపై ద్వేషం పెంచుకోవడం సరికాదు. ఒక వ్యక్తి జీవితంలో అనుభవించే చేదు అతన్ని మంచి వ్యక్తిగా మార్చాలి.. చెడు వ్యక్తిగా మార్చకూడదని ఒక జర్నలిస్ట్ నాతో చెప్పాడు, నేను దానిని అనుసరిస్తున్నాను” అని ఉపేంద్ర అన్నారు. “నేను జీరో నుంచి మొదలుపెట్టాను. మొదట్లో నా దగ్గర ఏమిలేదు. ఇప్పుడు నేను సంపాదించినదంతా ప్లస్.. నేను పొందకపోతే నష్టమేమీ లేదు. ఎందుకంటే అంతకు ముందు కూడా నా దగ్గర ఏమీ లేదు” అన్నాడు.

కాలేజీలు ఉన్నప్పుడు కవితలు రాసేవాడనని… దీంతో తనను తన బంధువు ఒకరు కాశీనాథ్ వద్దకు తీసుకువచ్చారని.. అక్కడ కూడా తన ప్రతిభతో కాశీనాథ్ మొదటి శిష్యుడిగా తర్లే నాన్ మగా సినిమాతో దర్శకుడిగా మారినట్లు తెలిపారు. కన్నడలో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఆయన రూపొందించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా యూఐ. త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.