Nuvve Nuvve : త్రివిక్రమ్‏ను ఏడిపించేసిన తరుణ్.. హీరో మాటలకు స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్..

|

Oct 12, 2022 | 7:34 AM

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించారు. ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు.

Nuvve Nuvve : త్రివిక్రమ్‏ను ఏడిపించేసిన తరుణ్.. హీరో మాటలకు స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్..
Tarun
Follow us on

ఒకప్పుడు లవర్ బాయ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే హీరో తరుణ్. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఎన్నో లవ్ స్టోరీస్ సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తరుణ్ కెరీర్‏లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాల్లో నువ్వే నువ్వే ఒకటి. తాజాగా ఈ మూవీ 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. సోమవారానికి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‏మీట్‏లో తరుణ్ మాట్లాడుతున్న సమయంలో త్రివిక్రమ్ ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ.. ”సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా… ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో సినిమా చూస్తా. నన్ను ‘నువ్వే కావాలి’తో రామోజీరావు గారు, ‘స్రవంతి’ రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను?’ చేశా. ఈ సంస్థలో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. హీరోగా నా తొలి సినిమా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా… ఆయన ఫస్ట్ హీరో నేనే. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి ఈ సినిమాలో తొలి సారి చేశా. ఆయన, శ్రియ, ఇతర నటీనటులు అందరితో పని చేయడం సంతోషంగా ఉంది. ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమా ఇంకొకటి చేయమని చాలా మంది అడుగుతారు. నాకు ఇటువంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే…. ఎప్పటికీ బోర్ కొట్టవు” అని అన్నారు.

అయితే తరుణ్ మాట్లాడుతున్న సమయంలో త్రివిక్రమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక శ్రియ మాట్లాడుతూ ”త్రివిక్రమ్ గారు, రవికిశోర్ గారు ఢిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నచ్చేసింది. ‘మీరు నిజంగా ఈ కథలో నేను నటించాలని అనుకుంటున్నారా?’ అని అడిగా. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. తరుణ్ స్వీట్ కో స్టార్. ప్రకాశ్ రాజ్ నా తండ్రిలా ఉండరు. కానీ, సినిమాలో తండ్రిలా చేశారు. మా మధ్య మ్యూజిక్ గురించి డిస్కషన్స్ జరిగాయి. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ మెమరీ” అని అన్నారు.