Kishore Tirumala : ఆ సినిమా కీర్తి సురేష్ కోసమే.. అందుకే ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసేలా చేశా.. డైరెక్టర్ కామెంట్స్..

సాధారణంగా కొందరు దర్శకులు స్టార్ హీరోహీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకుంటారు. ఆ హీరో మేనరిజం, నటనకు తగినట్లుగా తమ కథలో పాత్రలను సృష్టించుకుంటారు. కానీ కొన్ని కారణాలతో ఆ స్టార్స్ కాకుండా మరొకరి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలా చాలా సందర్భాల్లో కొందరు హీరోలు సూపర్ హిట్స్ మిస్సయ్యారు. కానీ హీరోయిన్ కోసమే డైరెక్టర్ ఎదురుచూసిన సందర్భం ఇది.

Kishore Tirumala : ఆ సినిమా కీర్తి సురేష్ కోసమే.. అందుకే ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసేలా చేశా.. డైరెక్టర్ కామెంట్స్..
Director Tirumala Kishore, Keerthy Suresh

Updated on: Jan 25, 2026 | 8:23 AM

కీర్తి సురేష్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత మహానటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో సావిత్రి పాత్రలో జీవించేసింది. రెండో సినిమాతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. బేబీ జాన్ మూవీతో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ ఆ మూవీ ఆశించిన స్తాయిలో ఆడలేదు. ఇదంతా పక్కన పెడితే.. కీర్తి సురేష్ కోసం టాలీవుడ్ డైరెక్టర్ కిషోర్ చేసిన రిస్క్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

కీర్తి సురేష్ కథానాయికగా పరిచయమైన సినిమా నేను శైలజ. ఈ మూవీతోనే దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిషోర్ తిరుమల. ఇందులో రామ్ పోతినేని హీరోగా నటించారు. లవ్, ఎమోషన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో ఫాదర్ ఎమోషన్ హైలెట్ అయ్యింది. ఈ సినిమాకు కీర్తిని ఎంపిక చేసుకోవడం పై డైరెక్టర్ కిషోర్ తిరుమల ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కిషోర్ తిరుమల. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో నేను శైలజ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

నేను శైలజ సినిమాకు శైలజ పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి.. కాబట్టి ఆ పాత్రకు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకున్నారట. కానీ నిర్మాతలు మాత్రం మరో స్టార్ హీరోయిన్ తీసుకోవాలని చెప్పారట. దీంతో ఆ స్టార్ హీరోయిన్ కు కథ చెప్పడానికి వెళ్లానని.. ఆమె కథను రిజెక్ట్ చేయాలని కావాలనే సరిగ్గా చెప్పలేదని.. ఆమె రిజెక్ట్ చేయడంతో సంతోషపడ్డానని అన్నారు. ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే శైలజగా చూపించడం కష్టమని అన్నారు. అందుకే కొత్త అమ్మాయి అయితేనే శైలజ పాత్రకు సరిపోతుందని తాను నమ్మానని..చివరకు ఆ నమ్మకమే నిజమైందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..