Tharun Bhascker: ట్రంప్‌ మామతో ఇరానీ టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

ఆ మధ్య తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా పెద్దగ ఆడలేదు. మలయాళం మూవీ రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తరుణ్ భాస్కర్.

Tharun Bhascker: ట్రంప్‌ మామతో ఇరానీ టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు
Tharun Bhascker, Donald Trump

Updated on: Apr 21, 2026 | 7:12 PM

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా గాయపడ్డ సింహం. కశ్యప్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే01న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లతో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. హీరో కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా డిఫరెంట్ స్టైల్ లో తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన తన సినిమా కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే రంగంలోకి దింపాడు. ఈ మేరకు ఏఐతో రూపొందించిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ట్రంప్‌ టీ తాగుతూ ఇండియన్‌ టీ వెరీ నైస్.. అంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి తరుణ్ భాస్కర్ .. ఇండియన్ టీ ఎప్పుడూ బాగానే ఉంటుంది.. కానీ మీరు తాగింది ఇరానీ టీ’ అని షాక్ ఇచ్చారు. దీంతో ట్రంప్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫుల్ ఫన్నీగా ఉండడంతో అందరూ తెగ నవ్వేస్తున్నారు. అలాగే ట్రంప్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా గాయపడ్డ సింహం మూవీని ఇరాన్‌లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్‌సీస్‌లో ఎస్‌వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్‌ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న ఓ నిర్ణయంతో యువకుడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది.. అనే కథాంశంతో ఈ గాయపడ్డ సింహం సినిమాను తెరకెక్కించారు. మే 1న థియేటర్‌లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే ఏప్రిల్‌ 30నే విదేశాల్లో రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలోనే ఇరాన్‌లో మాత్రం తమ సినిమా విడుదల కావడం లేదని తెలుపుతూ తాజాగా ఫన్నీ ఏఐ వీడియోను టీమ్‌ పంచుకుంది.

ఇవి కూడా చదవండి

 డొనాల్డ్ ట్రంప్, తరుణ్ భాస్కర్ ల ఫన్నీ వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us