ఆ బ్లాక్ బస్టర్ సినిమా నాతో ఎందుకు చేయలేదని పెద్ద హీరో అడిగారు.. మంచి కథ ఉంటే చెప్పమని అడిగారు

ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇటీవల నెంబర్ వన్ సినిమా నిర్మాణ అనుభవాలు, తన కెరీర్‌లో విజయానికి మూలసూత్రాలను ఆయన వివరించారు. అలాగే ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆ బ్లాక్ బస్టర్ సినిమా నాతో ఎందుకు చేయలేదని పెద్ద హీరో అడిగారు.. మంచి కథ ఉంటే చెప్పమని అడిగారు
Sv Krishnareddy

Updated on: Sep 20, 2026 | 8:45 PM

ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తన సినీ జీవితం, శుభలగ్నం వంటి విజయవంతమైన చిత్రాల వెనుక ఉన్న కథనాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమా విజయానికి కథే ప్రధానమని, తారాగణం కాదని ఆయన మొదటి నుంచి బలంగా నమ్ముతాను అని అన్నారు. అలాగే తన సినిమాలన్నీ కథాబలంతోనే విజయం సాధించాయని, భవిష్యత్తులో కూడా పెద్ద హీరోలతో కాకుండా కొత్తవారితోనే సినిమాలు తీస్తానని ఆయన స్పష్టం చేశారు. చిన్న వాళ్ళతోటే, కొత్త వాళ్ళో, పాత వాళ్ళ కాంబినేషన్ తోటో సినిమాలు తీయడానికి తాను ఆసక్తి చూపుతానని తెలిపారు కృష్ణారెడ్డి. శ్రీకాంత్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత తనదేనని కృష్ణారెడ్డి వెల్లడించారు. వినోదం చిత్రంతో శ్రీకాంత్‌ను హీరోగా పరిచయం చేశానని, ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్ ఒడిశా నుంచి వచ్చినప్పుడు తనకు అవకాశం ఇచ్చానని, ఆ సినిమా విజయవంతమైందని పేర్కొన్నారు. వినోదంతో పాటు కోట శ్రీనివాస రావుతో చేసిన ఒక కామెడీ ప్రయోగం కూడా బాగా ఆడిందని వివరించారు.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

దర్శకుడిగా రాణించిన కృష్ణారెడ్డి, తాను హీరోగా ఉగాది, అభిషేకం వంటి చిత్రాలలోనూ నటించారు. అభిషేకంలో డబుల్ రోల్ చేశానని, ఉగాది బాగా ఆడిందని తెలిపారు. అయితే, దర్శకత్వంపై దృష్టి పెట్టడంతో నటన నుంచి విరామం తీసుకున్నానని చెప్పారు. 76 ఏళ్ల వయస్సులో కూడా తాను మళ్ళీ హీరోగా చేస్తానని, తనలో ఆ నమ్మకం ఉందని చెప్పడం విశేషం. 1994లో “మాయలోడు” చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు తన వయసు 40-45 సంవత్సరాలు అని తెలిపారు.

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

“శుభలగ్నం” చిత్రం పెద్ద విజయం సాధించిన తర్వాత ప్రముఖ నటుడు శోభన్ బాబు తనని కలిశారని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. శోభన్ బాబు స్వయంగా హోటల్‌కు పిలిపించుకొని, “శుభలగ్నం” ఎలా తీశావో తెలియదు, నా సినిమాలేవీ అలా ఆడలేదు, నువ్వు ఏదో కొత్త విషయం చేశావు” అని అడిగారని తెలిపారు. భర్తను అమ్ముకునే కాన్సెప్ట్ తో సినిమా తీశానని, అది కొత్తదనం అని చెప్పగా, శోభన్ బాబు “ఇది నాతో ఎందుకు చేయలేదు” అని అడిగారని కృష్ణారెడ్డి వివరించారు. అయితే, అది కొత్త నటులతో చేయాల్సిన సినిమా కాబట్టి జగపతిబాబుతో చేశానని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. శోభన్ బాబు తనను తర్వాత కూడా ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పమని అడిగారని, అయితే ఒకసారి తాను కృష్ణుడు పాత్ర కోసం అడగగా, వయసు మళ్లడం వల్ల అలాంటి పాత్రలు చేయలేనని శోభన్ బాబు నిరాకరించారని కృష్ణారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us