ప్రముఖ దర్శకుడు , బిగ్ బాస్ ఫెమ్ సూర్య కిరణ్ కన్నుమూశారు. సూర్య కిరణ్ సోమవారం రోజున కన్నుమూశారని తెలుస్తోంది. పచ్చ కామెర్ల కారణంగా ‘సూర్యకిరణ్ మరణించినట్టు సమాచారం. సూర్య కిరణ్ మృతి పై టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కిరణ్ దర్శకుడిగా తెలుగు, తమిళ్ ప్రేక్షకులను మెప్పించారు. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షోలోనూ పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు సూర్య కిరణ్. సూర్య కిరణ్ అంత్యక్రియలు మంగళవారం నాడు జరగనున్నాయని తెలుస్తోంది. గతకొద్దిరోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్న ఆయనకు సోమవారం రోజున గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది.
గుండె పోటు కారణంగా సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. తెలుగులో ఆయన సత్యం, ధన 51, మంచు మనోజ్ రాజు భాయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన అరసి సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇక బాలనటుడిగాను సూర్య కిరణ్ చాలా సినిమాల్లో కనిపించారు. తెలుగు, తమిళ్ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 సినిమాల్లో నటించారు సూర్య కిరణ్. సీనియర్ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్ ఆతర్వాత ఆమెతో విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు ఆయన కన్నుమూశారన్న వార్తతో సినీ ఇండస్ట్రీ దిగ్బంతి వ్యక్తం చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.