
Pawan Kalyan: ఈసెంట్ గా భీమ్లానాయక్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా మీద దృష్టి పెట్టారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు పవర్ స్టార్. అందులో భాగంగా చకచకా ఆయా సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. ప్రియాడికల్ హిస్టారికల్ కాన్సెప్ట్ తో రాబోతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. ‘హరి హర వీరమల్లు’ సెట్స్ పై ఉండగా, ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. ఇక ఆ తరువాత లైన్లో సురేందర్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్.
ఇదిలా ఉంటే పవన్ మూడు రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జోరుగా ప్రచారం జరుగుతుంది. వీటిలో ఒక సినిమాకు విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నాడు. అలాగే సుధీర్ వర్మ ఓ సినిమాను చేయనున్నాడని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. సుధీర్ వర్మ ‘స్వామిరారా’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తరువాత ‘దోచేయ్’ .. ‘కేశవ’ .. ‘రణరంగం’ సినిమాలు చేశాడు. ఇప్పుడు మాస్ రాజా రవితేజ హీరోగా రావణాసుర సినిమా చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :