RRR Movie: ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై స్పందించిన జక్కన్న.. ఒక్కరు నటిస్తే అంతా విలన్స్ కాదంటూ ..

|

Sep 22, 2022 | 3:51 PM

ఇటీవల యూఎస్‏లో జరిగిన ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్‏లో బ్రిటిష్ వారిని విలన్స్‏గా చూపించారని బ్రిటన్ దేశీయులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ.. ఒక్కరు విలన్‏గా నటిస్తే అందరూ విలన్స్ కాదని అన్నారు.

RRR Movie: ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై స్పందించిన జక్కన్న.. ఒక్కరు నటిస్తే అంతా విలన్స్ కాదంటూ ..
Rajamouli
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో విడుదలై దాదాపు రూ. 1000 కోట్లకు పైగ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా.. జక్కన్న డైరెక్షన్, స్క్రీన్ ప్లేపై.. చరణ్, తారక్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. భారతీయ సినిమాను హాలీవుడ్ స్థాయికి పరిచయం చేశారు జక్కన్న. అయితే అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ మూవీపై ఓవర్గం మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల యూఎస్‏లో జరిగిన ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్‏లో బ్రిటిష్ వారిని విలన్స్‏గా చూపించారని బ్రిటన్ దేశీయులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ.. ఒక్కరు విలన్‏గా నటిస్తే అందరూ విలన్స్ కాదని అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ” సినిమా ప్రారంభానికి ముందు వచ్చే డిస్ల్కైమర్ చూసే ఉంటారు. ఒక వేళ మిస్ అయిన సమస్య కాదు. ఇది చరిత్ర కాదు. కేవలం కల్పిత కథ. సాధారణంగానే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. బ్రిటీష్ వారు ఒక్కరు విలన్‏గా నటిస్తున్నారంటే..బ్రిటీషర్లందరూ విలన్స్ అని నేను అనడం లేదని ఆడియన్స్ కు తెలుసు. నా హీరోలు భారతీయులు.. ప్రతినాయకులు బ్రిటీష్ వాళ్లు మాత్రమే అంతే. ఈ సినిమాలో ఫలానా వ్యక్తి విలన్, ఫలానా వ్యక్తి హీరో అనేది ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. వారికి అన్ని విషయాలపై అవగాహన లేకపోవచ్చు. కానీ వారి భావోద్వేగ మేధస్సు చాలా ఎక్కువ. కథారచయితగా మనం అర్థం చేసుకున్న తర్వాత.. అన్ని విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.