టాలెంటెడ్ హీరో శర్వానంద్.. రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham). అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించారు. సెప్టెంబర్ 9న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా అమల.. శర్వానంద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది చిత్రయూనిట్. ఈ సినిమా సక్సెస్ సెలబ్రెషన్స్లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ శ్రీకార్తిక్. శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవమని.. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్ అని అన్నారు. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. అతని లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. శర్వాకి ఒక మంచి సినిమా, మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందని నమ్మాను.. కానీ ఇప్పుడు ఆ నమ్మకం నిజమైయింది అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని.. రెండో సినిమా ఆయనతో చేయాలని ఉందన్నారు. ఆయన దగ్గరకు వెళ్లి కథ చెప్పాలి.. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే. మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ ఫ్యాన్సే. ఆయనతో సినిమా కోసం ఐదేళ్ళు నిరీక్షంచడానికి కూడా ఓకే. నా కెరీర్ లో ఐదు సినిమాలు చేసినా అవన్నీ కూడా మంచి సినిమాలుగా ఉండాలనేదే నా లక్ష్యం అని తెలిపారు. పెద్ద స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అన్ని జోనర్స్ ఇష్టం. ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ లో ఉంటుందన్నారు.