Game Changer: మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలుస్తాడు.. డైరెక్షన్ శంకర్ కామెంట్స్

|

Jan 03, 2025 | 8:22 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Game Changer: మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలుస్తాడు.. డైరెక్షన్ శంకర్ కామెంట్స్
Game Changer
Follow us on

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం..

స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. అందరూ శంకర్, సంకాంత్రి కలిపి శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ నవమి. రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడ రామ్ చరణ్ కాకుండా మీకు ఆ పాత్రలే కనిపిస్తాయి. అంత అద్భుతంగా కనిపిస్తారు. సాంగ్స్, యాక్షన్స్, పర్ఫామెన్స్ ఇలా అన్నింట్లో అద్భుతంగా నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్‌ను చూసేందుకే జనాలు వచ్చేస్తారు. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారు. కియారా అద్వాణీ గారు రామ్ చరణ్ గారితో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అంజలి గారు తన నటనతో పాత్రకు జీవం పోశారు. ఎస్ జే సూర్య లాంటి యాక్టర్స్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం. ఒక్కో సీన్, ఒక్కో షాట్‌ను ఎంతో పర్ఫెక్ట్‌గా చేస్తారు. శ్రీకాంత్ గారు ప్రోస్థటిక్ మేకప్‌తో చాలా చక్కగా నటించారు. చూస్తే నార్మల్‌గా ఉంటారు. కెమెరాముందుకు వస్తే మాత్రం సింహాంలా నటించేస్తారు. సముద్రఖని గారు ఎంతో సహజంగా నటిస్తారు. సునీల్ గారికి చాలా కొత్త పాత్రను చేశారు. రాజీవ్ కనకాల గారు తన అనుభవాన్ని చూపించారు. ఆర్టిస్టులంతా కలిసి తమ నటనతో ఈ సినిమాను నిలబెట్టారు. నేను ఏం అడిగినా, ఏం చెప్పినా కూడా దిల్ రాజు ఇచ్చారు. నన్ను తెలుగుకి పరిచయం చేసినందుకు దిల్ రాజు గారికి థాంక్స్. ప్రతీ రోజూ సెట్స్‌కు వచ్చి అన్నీ గమనిస్తుంటారు. శిరీష్ గారు దిల్ రాజుకు ఎంతో సపోర్ట్‌గా ఉంటారు అని శంకర్ అన్నారు.

అలాగే రెహమాన్ లేడనే లేటు నాకు తెలీకుండా తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. డీఓపీ తిరు గారు ఒక్కో విజువల్‌ను ఐ క్యాచీగా ఇచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ఫ్రా రెడ్ టెక్నాలజీ వాడాం. పాటలకు చాలా వరకు కొత్త టెక్నాలజీ వాడాం. జరగండి సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్‌ అవినాష్ కొల్ల అద్భుతంగా వేశారు. రామకృష్ణ వేసిన డోప్ సాంగ్ సెట్ బాగా వచ్చింది. ఎడిటర్ రూబెన్ ఈ సినిమాను రేసీగా కట్ చేశారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఓ ఐదు నిమిషాలు గ్యాప్ దొరికినా ఫోన్ చూసేస్తుంటారు. కానీ అలా పక్కకి తిప్పుకోనివ్వకుండా అద్భుతంగా కట్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా వచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ వద్ద కథను తీసుకుని ఈ మూవీని చేశాను. ఇది కూడా నాకు ఓ గేమ్ చేంజర్ లాంటిదే. సాయి మాధవ్ బుర్రా గారు అద్భుతమైన డైలాగ్స్ రాసిచ్చారు. పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండేలా రాసిచ్చారు. ప్రభుదేవా గారు జరగండి సాంగ్‌ను ఫ్రీగా చేశారు. రామ్ చరణ్ గారి మీద ప్రేమతో, దిల్ రాజు గారు ప్రేమతో ఆయన ఉచితంగా చేశారు. రా మచ్చా పాటను గణేష్ ఆచార్య గారు చేశారు. ప్రతీ కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ గారి మీద చాలా పెద్ద షాట్స్, స్టెప్స్ వేయించారు. ప్రేమ్ రక్షిత్ గారు సోలో ఫుల్ సాంగ్ చేశారు. జానీ మాస్టర్ గారు డూప్ సాంగ్ చేశారు. నేను ఏదో కొత్తగా ఆలోచిస్తే నాకంటే కొత్తగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు. హైరానా పాటను బాస్కో మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. శాండీ గారు బిట్ సాంగ్ చేశారు. అన్బరివ్ యాక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యాం గారు ఓ ఫోక్ సాంగ్ రాసిచ్చారు. హాలీవుడ్‌లా మనం తీయాలని అనుకుంటాం. కానీ హాలీవుడ్ కూడా ఇప్పుడు మనలా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. దానికి కారణం రాజమౌళి గారు. జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతోంది’ అని  శంకర్ అన్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.