Sailesh Kolanu: హిట్ 3 లీక్స్ పై డైరెక్టర్ అసంతృప్తి.. ఎంతో బాధగా ఉందంటూ ట్వీట్..

కొన్నాళ్లుగా సినీరంగాన్ని వేధిస్తోన్న ప్రధాన సమస్య పైరసీ.. లీక్స్. భారీ బడ్జెట్ చిత్రాలు సెట్స్ పై ఉండగానే ఈ మూవీ క్లిప్స్, పోస్టర్స్ నెట్టింట ప్రత్యేక్షమవుతున్నాయి. తాజాగా లీక్స్ బెడదపై డైరెక్టర్ శైలేష్ కొలను అసంతృప్తి వ్యక్తం చేశారు. తను ఎంతో భద్రంగా దాచుకున్న విషయాన్ని ఎళా లీక్ చేస్తారంటూ మీడియా తీరపై మీద శైలేష్ కొలను అసహనం వ్యక్తం చేశాడు.

Sailesh Kolanu: హిట్ 3 లీక్స్ పై డైరెక్టర్ అసంతృప్తి.. ఎంతో బాధగా ఉందంటూ ట్వీట్..
Sailesh Kolanu

Updated on: Apr 04, 2025 | 10:22 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. ఇందులో నాని సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఎగ్జైటింగ్ గా అనిపించే ట్విస్టులను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేశారు. తను ఎంతో భద్రంగా దాచుకున్న విషయాన్ని ఎలా లీక్ చేస్తారంటూ మీడియా తీరుపై శైలేష్ కొలను అసహనం వ్యక్తం చేశాడు.

“మన ప్రేక్షకులు సినిమాల్లో అనుభవించే ప్రతి ఒక్క ఎగ్జైటింగ్ మూమెంట్ కోసం.. మేము రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటాం. శారీరక సామర్థ్యాలకు మించి పనిచేస్తుంటాం. అవన్నీ మేము ఆడిటోరియంలో సృష్టించాలనుకునే ఆ ఎఫెక్ట్ కోసం.. రిజల్ట్ కోసమే. అందులోనే మాకు గర్వకారణం ఉంటుంది. ప్రస్తుతం మీడియా పరిస్థితి చూస్తే బాధగా అనిపిస్తుంది. కొంతమంది మేము చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగానే లీక్ చేస్తున్నారు. థియేటర్లలో ఆ మూమెంట్ అడియన్స్ ఎంజాయ్ చేయాలని ఎంతో కష్టపడి సినిమా తీస్తే వాటిని లీక్ చేసి చెడగొట్టేస్తున్నారు. ఫస్ట్ రిపోర్ట్ చేయాలనే మీ కర్తవ్యం గురించి మాకు తెలుసు. అలా అని ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నవి లేకుండా ప్రతిదీ లీక్ చేస్తున్నారు. ఇలా చేయడం తప్పా ? రైటా ? ఆలోచించుకోండి. గొప్ప విలువలతో కూడిన జర్నలిజం ఉండేది. ఎన్నో విషయాలు తెలిసినా బయటకు చెప్పేవారు కాదు.. అది ఎథిక్స్ అంటే.. లీక్ చేయడం అంటే..మా నుంచి దొంగతనం చేసినట్లు కాదు” అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం శైలేష్ కొలను చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. హిట్ 3 చిత్రాన్ని మే1న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..