Kuberaa Movie: కుబేర మూవీ నుంచి రష్మిక సాంగ్ ఔట్.. అసలు కారణం చెప్పిన శేఖర్ కమ్ముల

ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శుక్రవారం (జూన్ 20)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

Kuberaa Movie: కుబేర మూవీ నుంచి రష్మిక సాంగ్ ఔట్.. అసలు కారణం చెప్పిన శేఖర్ కమ్ముల
Kuberaa Movie

Updated on: Jun 21, 2025 | 8:26 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్, ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో మెరవగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో శుక్రవారం (జూన్ 20)న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కినేని అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక సినిమాలో రష్మిక నటన కూడా సూపర్బ్ గా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు పీపీ..డుమ్ డుమ్‌ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రష్మిక సోలో గా కనిపించే ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే శుక్రవారం రిలీజైన సినిమాలో మాత్రం ఈ సాంగ్ కనిపించలేదు. దీంతో రష్మిక ఫ్యాన్స్ కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడిదే విషయంపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు. కుబేర సినిమా గ్రాండ్ సక్సెస్‌ కావడంతో తాజాగా మూవీ టీమ్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఇందులో నాగార్జునతో పాటు డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్‌ అనే రష్మిక సాంగ్‌ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురైంది. దీనికి శేఖర్ కమ్ముల ఇలా సమాధానమిచ్చారు.

‘కుబేర పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్‌ ఉండాలకున్నాం. అయితే ఈ సాంగ్‌ను కావాలని మేము తీయలేదు. అయితే ఎమోషనల్ గా స్పీడ్ గా సాగిపోయే కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నాం. వేరే మంచి సీన్‌ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదు. ఈ చిత్రంలో ఒక్క సీన్‌, ఒక్క డైలాగ్‌ తీసేసినా ఈ సినిమా ఉండదు.. అలా కథ రాసుకున్నాను’ అని శేఖర్ కమ్ముల వివరించారు.

ఇవి కూడా చదవండి

ఓవర్సీస్ లోనూ కుబేరకు భారీ కలెక్షన్లు..

 

కాగా కుబేర సినిమా మొదటి రోజు రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..