Director Sandeep Reddy Vanga: స్పిరిట్ స్టోరీ లీక్ చేయడంపై సందీప్ రెడ్డి సంచలన ట్వీట్.. ఆమె గురించేనా.. ?

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ షేక్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో స్పిరిట్ అనే చిత్రాన్ని రూపొందిస్తు్న్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా స్పిరిట్ మూవీ గురించి రోజుకో న్యూస్ వైరలవుతుంది.

Director Sandeep Reddy Vanga: స్పిరిట్ స్టోరీ లీక్ చేయడంపై సందీప్ రెడ్డి సంచలన ట్వీట్.. ఆమె గురించేనా.. ?
Sandeep Reddy Vanga

Updated on: May 27, 2025 | 8:29 AM

యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక యానిమల్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో స్పిరిట్ అనే ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నానని సందీప్ రెడ్డి ప్రకటించారు. దీంతో వీరిద్దరి కాంబోపై భారీ హైప్ నెలకొంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించే నటీనటుల గురించి కొన్నాళ్లుగా ఫిల్మ్ వర్గాల్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకున్నారని.. కానీ అనుహ్యంగా ఆమెను తప్పించి ఆ స్థానంలోకి మరో హీరోయిన్ ను తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. ఈ క్రమంలో స్పిరిట్ చిత్రంలో కథానాయికగా త్రిప్తి డిమ్రీ అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే తాజాగా స్పిరిట్ మూవీ స్టోరీని దీపికా పీఆర్ టీమ్ లీక్ చేసిందని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు సందీప్ రెడ్డి. మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం కదిలించలేరని.. స్టోరీ మొత్తం లీక్ చేసినా నాకేం ఫరఖ్ పడదంటూ పరొక్షంగానే వార్నింగ్ ఇచ్చేశారు. ఇదేనా మీ ఫెమినిజం ? అంటూ కౌంటరిచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

”నేను ఓ నటికి స్టోరీని చెప్పినప్పుడు.. ఆమెపై వందశాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ (NDA) ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయటపెట్టుకుంటున్నారు. ఒక యంగ్ నటిని కిందకు లాగడం.. ఆమెను విమర్శించడం… నా స్టోరీని లీక్ చేయడం.. ఇదేనా మీ ఫెమినిజం.. ? నేను ఓ ఫిల్మ్ మేకర్ లో ఓ సినిమా కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతుంటాం. నాకు సినిమానే ప్రపంచం. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. ఈసారి స్టోరీ మొత్తం లీక్ చేయండి. నాకేం ఫరక్ పడదు” అంటూ ట్వీట్ చేశారు సందీప్ రెడ్డి. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..