Director V Samudra : రొమాన్స్ సీన్స్ లేవు.. సినిమా ఆడదు వద్దన్నారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
దర్శకుడు సముద్ర ఒకప్పుడు తెలుగులో ఫేమస్ డైరెక్టర్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అంతేకాదు మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. 2001లో విడుదలైన ఆ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తల్లికి, తన బిడ్డకు మధ్య ఉండే అనుబంధం, ఒక వ్యక్తి నైతిక విలువలు, ఆత్మగౌరవంతో జీవించే విధానాన్ని ఈ సినిమా సున్నితంగా చూపించి భారీ విజయాన్ని అందుకున్నారు.

దర్శకుడు సముద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే తాను రూపొందించిన మొదటి చిత్రం సింహరాశి విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2001లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తల్లికి, తన బిడ్డకు మధ్య ఉండే అనుబంధం, ఒక వ్యక్తి నైతిక విలువలు, ఆత్మగౌరవంతో జీవించే విధానాన్ని ఈ సినిమా సున్నితంగా చూపించింది. సినిమా 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సముద్ర తన అనుభవాలను పంచుకున్నారు. ఆయనకు ఈ సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయినట్లుగానే అనిపిస్తుందని తెలిపారు. సింహరాశి కథానాయకుడు తన తల్లి తనను తాకలేని పరిస్థితిలో ఉండగా, ఇంకెవరూ తన శరీరాన్ని తాకకూడదని భీష్ముడిలా శపథం చేస్తాడు. ఇటువంటి క్లిష్టమైన కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంలో దర్శకుడు సముద్ర విజయం సాధించారు. తమిళంలో సగటు చిత్రంగా నిలిచిన ఈ సినిమాను తెలుగులో పునర్నిర్మించడం సముద్రకు ఒక సవాలుగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
95 శాతం మంది ఇది విజయవంతం కాదని భావించినా, సముద్ర తన ఆలోచనను నమ్మారు. ఈ సినిమాలో రోమాన్స్ సీన్స్ లేవు.. తమిళంలోనే హిట్టు కాలేదు.. ఇక్కడేం ఆడుతుందని అన్నారు. కానీ ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. గీత రచయిత సీతారామశాస్త్రి ఈ చిత్రాన్ని ఎంతగానో అభినందించారు. అమ్మ సెంటిమెంట్ అద్భుతంగా ఉంది, హీరో క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది, గొప్ప లవ్ స్టోరీ ఉంది అని సీతారామశాస్త్రి పేర్కొన్నారని సముద్ర తెలిపారు. సింహరాశిలో అనేక హృదయవిదారక సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, చిన్న పిల్లాడిని అన్నం పంతిలోంచి లేపి, అంటరాని వాడివి అని బయటకు తీసుకెళ్లి రాగిముద్ద పెట్టే సన్నివేశం ప్రేక్షకులను కదిలించింది. అలాగే, తల్లి చనిపోయినప్పుడు చివరిసారి ఆమె ముఖం చూడలేకపోయే సన్నివేశం కూడా ఎంతోమందిని కంటతడి పెట్టించింది. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. బ్రహ్మానందం మెరుపు తీగ పాత్రలో అందించిన కామెడీ కూడా సినిమా విజయానికి కీలక పాత్ర పోషించింది, వీక్షకులను ఆకర్షించింది.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
సినిమాలోని పాత్రల ఎంపికలో దర్శకుడు జాగ్రత్త వహించారు. విజయ్‌కుమార్ , తల్లి పాత్రను తమిళం నుండే తీసుకున్నారు. అయితే, హీరోయిన్ సాక్షి శివానంద్‌ను ఒక హోమ్లీ క్యారెక్టర్‌లో చూపించి, ఆమె మునుపటి గ్లామర్ పాత్రలకు భిన్నంగా చిత్రీకరించారు. దర్శకుడు సముద్ర తన తొలి సినిమా సింహరాశి మొదటి రోజు దేవి థియేటర్‌లో చూశారు. అప్పట్లో లభించిన హిట్ టాక్ తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆయన చెప్పారు. నిర్మాత ఆర్.బి. చౌదరి కూడా సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని సముద్ర తెలిపారు. ఒక సినిమా జీవితాంతం గుర్తుండేలా ఉండాలనే సముద్ర ఆకాంక్ష సింహరాశితో నెరవేరింది.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
