Ram Gopal Varma: మీరు మారరా?.. టీచర్స్‌డేపై రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ ట్వీట్.. భగ్గుమన్న నెటిజన్లు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. రామ్ గోపాల్ వర్మ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

Ram Gopal Varma: మీరు మారరా?.. టీచర్స్‌డేపై రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ ట్వీట్.. భగ్గుమన్న నెటిజన్లు
Director Ram Gopal Varma

Updated on: Sep 24, 2025 | 1:54 PM

గతంలో సినిమాలతో సంచలన సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలతో సావాసం చేస్తున్నారు. తరచూ కాంట్రవర్సీ పోస్టులు, కామెంట్స్ తో నెట్టింట ట్రెండ్ వుతున్నారు. తాజాగా టీచర్స్ డే సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీచర్స్ డే రోజున రామ్ గోపాల్ వర్మ తనకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల జాబితాను షేర్ చేస్తూ, వారికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. అయితే ఆ జాబితాలో అతను పేర్కొన్న పేర్లలో ఒక పేరు ఉండడం సంచలనంగా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఈ సంచలన దర్శకుడిపై భగ్గుమంటున్నారు.

“నేను దర్శకుడిగా మారడానికి, నా జీవితంలో నాకు నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే నా సెల్యూట్. నాకు స్ఫూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీంలకు టీచర్స్ డే శుభాకాంక్షలు’ అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వర్మ ట్వీట్‌ వైరల్ అయింది. నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ ఆర్జీవీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని , భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని , గురువుగా చెప్పడమేంటని ప్రశ్నించారు. పైగా, పవిత్రంగా భావించే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇలాంటి చెత్త పోస్టులు పెట్టడమేంటి? అని ఆర్జీవీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
‘ఇలాంటి ట్వీట్లు దారుణం. దావూద్‌ ఇబ్రహీంను గర్వంగా ప్రస్తావించడం సిగ్గుచేటు .. ఇది ఉపాధ్యాయుల దినోత్సవం… నేరస్థుడిని మెంటార్‌గా చెప్పడమేంటో’ అంటూ నెటిజన్లు ఆర్జీవీపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వివాదానికి కారణమైన రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..