Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై జక్కన్న ఫోకస్.. మరో విజువల్ వండర్ చేసేందుకు సిద్ధమయ్యాడా ?..

|

Jul 09, 2022 | 6:42 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో జక్కన్న తెరకెక్కించే సినిమాపై ఇప్పటికే ఎన్నో రకాల అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై జక్కన్న ఫోకస్.. మరో విజువల్ వండర్ చేసేందుకు సిద్ధమయ్యాడా ?..
Rajamouli Mahesh
Follow us on

బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్తాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇటీవల ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు జక్కన్న. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఈ మూవీ రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసి రికాకర్డుకెక్కింది. జక్కన్న కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో జక్కన్న తెరకెక్కించే సినిమాపై ఇప్పటికే ఎన్నో రకాల అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడట. బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ తో మరో విజువల్ వండర్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు రూ. 550 కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ రెంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అప్డేట్స్ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది.